చాలా విషయాల్లో.. ముఖ్యంగా ప్రేమ, డేటింగ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ విషయాల్లో సినిమా సెలబ్రెటీలు చాలా మంది మీడియా ముందు స్పందిచకుండానే తిరుగుతుంటారు. కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చినప్పుడు వారిలోని కొత్త కోణాన్ని బయటపెడుతుంటారు. అర్ధమయ్యి, అర్ధమవనట్లు చాలా లోతైన వివరణతో కూడిన సమాధానంతో స్పందిస్తుంటారు. దానివెనకున్న ఇంటెన్షన్ ప్రేక్షకులకు అర్ధమవుతుందనుకోండి.. అది వేరేవిషయం. తాజాగా ఇదేస్థాయి టాలెంట్ తో డిఫరెంట్ గా స్పందించింది కత్రినా కైఫ్.
కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ షో లో అనుష్క శర్మతో కలిసి చిట్ చాట్ చేసిన కత్రినా కైఫ్ కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు తిప్పి తిప్పి సమాదానం చెప్పింది. ఆ ప్రశ్న ఏమిటంటే... బాలీవుడ్ నటుడు రణ బీర్ కపూర్ తో కత్రినా రిలేషన్ షిప్ గురించి. గత ఏడాది డిసెంబరు లో వీరి మధ్య రిలేషన్ బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మీకు బాధనిపించలేదా అని కరణ్ అడగ్గా స్పందించిన కత్రినా... "మనం తుపానులో చిక్కుకున్నప్పుడు వెదర్ రిపోర్ట్ ఏమి చెబుతుందనే విషయం పట్టించుకుంటామా? లేదు కదా! తుపాను బారిన పడినవాళ్లు మాత్రం బాదపడుతుంటారు.." అని సమాధానం చెప్పింది.
అంటే ఈ సమాధానంలో వాతావరణశాఖ రిపోర్ట్ కరణ్ - జనాలు ప్రశ్నలు అనుకుంటే తుపానులో చిక్కుకుంది మాత్రం కత్రినా అని అర్ధమేమో అని జానాలు క్లారిటీకి వస్తున్నారు. ఏది ఏమైనా.. కత్రినా చాలా డిఫరెంట్ గానే స్పందించిందని ఆమె అభిమానులు మురిసిపోతున్నారట. పాపం కత్రినా... రణబీర్ ప్రేమ తుపాను బాధితురాలన్నమాట!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/