సైఫ్ అలీఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఫాంటమ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కత్రిన గెటప్స్ ఇప్పటికే డిష్కసన్ పాయింట్ అయ్యాయి. డీగ్లామరస్ రోల్ లో కనిపిస్తోంది క్యాట్. అయితే ఈ లుక్ మీనింగ్ ఏంటి? అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో అంతకంతకు పెరుగుతోంది. అందుకే ఈ డీటెయిల్స్...
దర్శకుడు కాకముందు కబీర్ ఖాన్ డాక్యుమెంటరీ ఫిలింమేకర్ గా బోలెడన్ని దేశాలు తిరిగాడు. ఆఫ్ఘనిస్తాన్, బోస్నియా, ఇస్రాయేల్ తదితర చోట్ల తిరిగాడు. అక్కడ పలు రకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను దగ్గరగా చూశాడు. వీళ్లంతా లోకల్ గయ్స్ నే రహస్యంగా రిక్రూట్ చేసుకుని, స్లీపర్ సెల్స్ తరహాలోనే తమ ఆపరేషన్ కి ఉపయోగించుకునేవారు. ఇప్పుడు అదే తరహాలో ఫాంటమ్ సినిమాలో కథానాయిక రోల్ ఉంటుంది.
కత్రిన ఓ పార్సీ ఇండియన్ గాళ్ గా కనిపించబోతోంది. చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ నేరగాళ్లను వలవేసి పట్టుకునే అత్యంత ట్యాలెంటెడ్ గాళ్ గా కత్రినని తెరపై చూపించబోతున్నాడు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఆసక్తి రేకెత్తించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కత్రిన నటన హైలైట్ గా ఉంటుందని చెబుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా క్యాట్ అలానే ఎందుకు కనిపిస్తోందో?