ఫోటో స్టోరీ : రెడ్ కలర్ శారీ.. ఎర్ర గులాబీ అందాలు..!

Update: 2022-10-21 01:30 GMT
రెండు దశాబ్ధాల క్రితం భూమ్ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన బ్రిటీష్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇండియన్ ఆడియన్స్ తనకు ఇచ్చిన రెస్పాన్స్ కి ఇక్కడే సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ఈ అమ్మడు తన కెరియర్ లో దాదాపు 46 సినిమాల దాకా చేసింది.

హిందీలో భూమ్ తీసిన ఆమెని తెలుగులో వెంకటేష్ సరసన మల్లీశ్వరిగా తీసుకొచ్చారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గాయపరచింది కత్రినా కైఫ్. కెరియర్ మొదట్లోనే కత్రినా కైఫ్ తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవడంతో ఇక్కడ అవకాశాలు వచ్చినా సరే లైట్ తీసుకుంది.      

బాలీవుడ్ హీరోయిన్స్ లో తనకంటూ ఒక మార్క్ వేసుకున్న కత్రినా కైఫ్ కేవలం సినిమాలతోనే కాదు డేటింగ్ వార్తలతో కూడా హెడ్ లైన్స్ లో ఉంటూ వచ్చింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో ఆమె వ్యవహారం చాలా దూరం వెళ్లిందని అప్పట్లో బాలీవుడ్ మీడియా ఒకటే హడావిడి చేసింది.

సల్మాన్, కత్రినా మ్యారేజ్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా ఫైనల్ గా  హీరో విక్కీ కౌశల్ ని పెళ్లాడింది. వీరిద్దరు కూడా కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లితో ఒకటయ్యారు. 2021 లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల మ్యారేజ్ జరిగింది.

పెళ్లైనా సరే గ్లామర్ షోలో వెనక్కి తగ్గట్లేదు కత్రినా కైఫ్. తన భర్త విక్కీ కౌశల్ తో పూల్ లో హాట్ ఫోజులతో ఆడియన్స్ ని అలరిస్తున్న కత్రినా లేటెస్ట్ గా రెడ్ కలర్ శారీలో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఎర్ర గులాబి అందంలా ఓర చూపులతో కుర్రాళ్ల గుండెలోత్తుల్లో గుచ్చేస్తుంది కత్రినా కైఫ్.

అమ్మడి అందాల గురించి వర్ణించేందుకు ఏ కాళిదాసో దిగి రావాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో మెర్రి క్రిస్మస్.. టైగర్ 3 సినిమాల్లో నటిస్తుంది కత్రినా కైఫ్. పెళ్లైనా సరే వరుస సినిమాల్లో నటిస్తూ తన జోరు కొనసాగిస్తుంది ఈ బ్యూటీ.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News