డైరెక్టర్ కి కటింగ్ కొట్టిన కత్రినా

Update: 2017-02-05 09:29 GMT
ఓ హీరోయిన్ ని ఆన్ స్క్రీన్ పై ఎలా చూపించాలనే విషయంలో.. దర్శకుడి మైండ్ లో ముందు నుంచి ఓ విజువల్ ఉంటుంది. దానికి తగ్గట్లుగా హీరోయిన్ ని సిద్ధం చేసేందుకు కాస్ట్యూమ్స్ డిజైనర్స్.. మేకప్ మెన్.. కెమేరా మెన్ తెగ కష్టపడాల్సి ఉంటుంది. ఇదంతా హీరోయిన్ ని అందంగా ఆకర్షణీయంగా చూపించేందుకు యూనిట్ పడే కష్టం. అయితే.. డైరెక్టర్ కి హీరోయిన్ స్టైలింగ్ చేయడం మాత్రం విచిత్రం అనే చెప్పాలి.

ప్రస్తుతం జగ్గా జాసూస్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనురాగ్ బసు. ఇందులో మాజీ లవర్స్ అయిన రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్ లు జంటగా నటిస్తున్నారు. వీళ్ల బ్రేకప్ కంటే ముందే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా జగ్గా జాసూస్ సెట్స్ పై.. దర్శకుడు అనురాగ్ బసుకు.. హీరోయిన్ కత్రినా హెయిర్ కటింగ్ చేసేయడం సెన్సేషన్ అవుతోంది. అది కూడా సరదాగా కాదు.. సీరియస్ గానే ట్రిమ్మర్ తో హెయిర్ కటింగ్ కొట్టేసింది కత్రిన.

తన  హెయిర్ కట్ చేసేస్తుంటే.. దర్శకుడు అనురాగ్ బసు.. కెవ్వుమని అరుస్తూ ఏడుస్తున్న వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఈ మధ్య అనురాగ్ బసుతో తరచుగా కనిపిస్తోంది కత్రినా కైఫ్. రీసెంట్ గా ఈ దర్శకుడి ఇంట్లో జరిగిన సరస్వతీ పూజలో కూడా కేట్ సందడి చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News