బిగ్ బాస్ సీజన్ -2లో ఏదైనా జరగొచ్చు...అని నాని చెప్పినట్లుగానే అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. తొలిసారిగా బిగ్ బాస్ పై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏకంగా ఓ కంటెస్టెంట్ పేరుతో ఆర్మీ తయారైంది. ఇక తాజాగా, బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారిగా ఓ కొత్త ఒరవడికి తెరలేచింది. బిగ్ బాస్ -2 లో ఒన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కౌశల్ కు మద్దతుగా ఏర్పడిన `కౌశల్ ఆర్మీ`....ఏకంగా హైదరాబాద్ లో `కౌశల్ ఆర్మీ 2కె`నిర్వహించింది. ఇప్పటిదాకా ఏ భాషలో అయినా ఓ కంటెస్టెంట్ కు మద్దతుగా 2కే రన్ నిర్వహించడం దాదాపుగా ఇదే తొలిసారి కాబోలు. ఇప్పటివరకు సోషల్ మీడియాలోనే కౌశల్ కు మద్దతు పలికిన కౌశల్ ఆర్మీ...ఆదివారం నాడు 2కే రన్ తో తమ బలనిరూపణ చేసింది. ఆ వాక్ కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో....ఫైనల్ విన్నర్ బిగ్ బాస్ అంటూ కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతోంది. ఈ 2కే రన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కౌశల్ కు మద్దతుగా సోషల్ మీడియా ద్వారా కౌశల్ ఆర్మీ యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ దగ్గరపడుతుండడంతో 2కే ర్యాలీ చేసి తమ బలాన్ని చూపాలని కౌశల్ ఆర్మీ అభిమానులకు పిలుపునిచ్చింది. దీంతో, నేడు జరిగిన 2కే రన్ కు బిగ్ బాస్ కూడా ఆశ్చర్యపోయేలా మద్దతు వచ్చింది. ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ముద్రించిన టీ షర్ట్ లను ధరించిన వారు వాక్ చేశారు. హౌస్ లో కౌశల్ ని టార్గెట్ చేసి ఒంటరి చేయడంతో కౌశల్ ఆర్మీ యాక్టివ్ గా మారింది. ఆ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు పెరిగి ...బిగ్ బాస్ ను శాసించే స్థాయికి ఎదిగింది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పడం వంటి కారణాలతో కౌశల్ తో మిగతా హౌస్ మేట్స్ గొడవపడేవారు. అందుకే ఒంటరి అయిన కౌశల్ కు ఆయన ఆర్మీ మద్దతుగా నిలిచింది.కౌశల్ తో గొడవపడ్డ.. కిరీటి - భాను శ్రీ - బాబు గోగినేని - దీప్తి సునయన - తేజస్వి - గణేష్ - నందిని ఎలిమినేట్ అయ్యారంటే కౌశల్ కు ఎంత మద్దతుందో తెలిసిపోతుంది. ఏది ఏమైనా, షో ప్రారంభానికి ముందు కొద్దిమందికే తెలిసిన కౌశల్...ఇపుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఇక, బిగ్ బాస్ విన్నర్ గా నిలిస్తే కౌశల్ కెరీర్ కూడా మలుపు తిరిగే అవకాశముంది.