తెలుగు బిగ్ బాస్ ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కౌశల్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ 2 ప్రారంభం అయిన రెండు వారాల్లోనే కౌశల్‌కు ఆర్మీ ఫామ్ అవ్వడం, ఆ ఆర్మీ బాగా పాపులర్ అవ్వడంతో కొందరు కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని, ఫేక్ ఆర్మీ అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అదే సమయంలో కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఎవరైతే కౌశల్ కు వ్యతిరేకంగా ఉంటూ వచ్చారో వారిని బయటకు పంపిస్తున్నాం అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కౌశల్ ఎప్పుడు ఎలిమినేషన్స్ లో ఉన్నా కూడా భారీగా ఓట్లు వేసి కౌశల్ ఆర్మీ కాపాడుకుంటూ వస్తుంది. అయినా కూడా కొందరు పెయిడ్ ఆర్మీ అంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
ఇటీవల హైదరాబాద్ తో పాటు వైజాగ్, విజయవాడల్లో కౌశల్ ఆర్మీ పేరుతో 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ 2కే రన్ ను చూసి కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ కాదు అనే అభిప్రాయంకు వచ్చారు. అయితే అనూహ్యంగా కౌశల్ ఆర్మీ తాజాగా విజయవాడలో నిర్వహించిన 2కే రన్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కౌశల్‌ఆర్మీ నిర్వహించిన 2కే రన్‌లో పాల్గొన్న ఒక వ్యక్తి హిడెన్ కెమెరా ముందు మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. కౌశల్ ఆర్మీ టీ షర్ట్ లు ఇవ్వడంతో పాటు ర్యాలీలో పాల్గొనే ముందు 200 మరియు వెళ్లే ముందు 200 రూపాయలు పెట్రోల్ ఖర్చుల కోసం ఇచ్చారు అంటూ ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో కౌశల్ యాంటీ ఫ్యాన్స్ కు ఇతర బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మద్దతు దారులకు ఆయుధంగా మారింది.
ఇన్ని రోజులుగా తాము కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అంటూ చెబుతున్నాం, ఇప్పుడు అది నిరూపితం అయ్యింది. ఎవరో భారీగా డబ్బులు పెట్టి మరీ ఈ ఆర్మీని నడుపుతున్నారు అంటూ కొందరు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోను కొందరు కావాలని క్రియేట్ చేశారని, కౌశల్ ను దెబ్బ తీయాలని, కౌశల్ ఆర్మీని విచ్చిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు కౌశల్ ఆర్మీ గ్రూప్ సభ్యులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అయితే ఓటింగ్ తో తేలిపోతుందని, మరి కొన్ని రోజుల్లో అసలు విషయం అందరికి తెలుస్తుందని కౌశల్ అభిమానులు చెప్పుకొచ్చారు.
వీడియో కోసం క్లిక్ చేయండి