తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ గెలుపొందిన విషయం తెల్సిందే. ఒక సామాన్య సెలబ్రెటీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ విజేతగా నిలుస్తాడని ఏ ఒక్కరు అనుకోలేదు. సీజన్ 2 ప్రారంభం అయిన సమయంలో విజేత ఎవరు అంటే గీతా మాధురి - తనీష్ - తేజస్వి ఇంకా ఒకరు ఇద్దరు పేర్లు వినిపించాయి. కాని ఏ ఒక్కరు కూడా కౌశల్ గెలుస్తాడంటూ నమ్మకంగా చెప్పలేదు. కాని ఎప్పుడైతే కౌశల్ ఆర్మీ ఫామ్ అయ్యిందో అప్పటి నుండి కూడా కౌశల్ గెలవడం ఖాయం అని అంతా అనుకున్నారు.
కౌశల్ విజేతగా నిలవడాన్ని ఇప్పటికి కూడా చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. మరి కొందరు మాత్రం కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా అనర్హుడు అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ లోని పార్టిసిపెంట్స్ అందరితో కూడా ఏదో ఒక సమయంలో గొడవ పడ్డాడు. ప్రతి ఒక్కరితో ఈయన విభేదించాడు. అందుకే బిగ్ బాస్ విజేతగా కౌశల్ అర్హుడు కాదు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
బిగ్ బాస్ లో కౌశల్ గెలవడాన్ని సినిమా పరిశ్రమలో కూడా కొందరు జీర్ణించుకోలేక పోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నో సినిమాల్లో నటించిన మాకే ఇంతగా ఫ్యాన్స్ లేరు. ఇలా కౌశల్ కు ఫ్యాన్స్ ఏర్పడటం ఏంటని కొందరు అంటున్నారు. మొత్తానికి కౌశల్ విజయం దక్కించుకున్న తర్వాత కూడా కొందరి నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కౌశల్ ఆర్మీ అనేది ఒకటి లేకుంటే కౌశల్ ఎప్పుడో ఇంటి నుండి బయటకు వచ్చేసేవాడు. రెండు విషయాల కారణంగా కౌశల్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినది. ఆ సంఘటనలు కనుక ఇంట్లో జరిగి ఉండకుంటే ఖచ్చితంగా కౌశల్ ఆర్మీ ఏర్పాటు అయ్యేది కాదు, కౌశల్ విజేత అయ్యేవాడు కాదు అంటున్నారు.
ఏది ఏమైనా కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అనే విషయం ఇప్పుడు అంతా ఒప్పుకోవాల్సిందే. కౌశల్ గెలుపుతో సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం జనాల మీద ఏ స్థాయిలో ఉందో దీంతో తేలిపోయింది.