చిత్రం : 'కవచం'
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ - మెహ్రీన్ కౌర్ - నీల్ నితిన్ ముకేశ్ - హర్షవర్ధన్ రాణె - ముకేష్ రుషి - పోసాని కృష్ణమురళి - సత్యం రాజేష్ జబర్దస్త్ వేణు తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు
మాటలు: అబ్బూరి రవి
రచనా సహకారం: కేశవ్
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ల
ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. చివరగా అతను నటించిన ‘సాక్ష్యం’ డిజాస్టర్ అయింది. ఇప్పటిదాకా మాస్ మసాలా సినిమాలే చేస్తూ వచ్చిన అతను.. ఈసారి కొంచెం రూటు మార్చి ‘కవచం’ అనే థ్రిల్లర్ సినిమా చేశాడు. శ్రీనివాస్ మామిళ్ల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్) వైజాగ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సిన్సియర్ ఎస్ఐ. అతను అనుకోకుండా ప్రమాదంలో ఉన్న సంయుక్త (మెహ్రీన్) అనే అమ్మాయిని కాపాడతాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉన్న విజయ్ తల్లిని ఆదుకోవడానికి సంయుక్త సాయం చేస్తుంది. కానీ సంయుక్త సాయం తీసుకున్నాక విజయ్ ఊహించని విధంగా చిక్కుల్లో పడతాడు. కిడ్నాప్ కేసులో చిక్కుకుంటాడు. ఇంతకీ విజయ్ ఎదురైన చిక్కులేంటి.. తనపై పడ్డ మచ్చను అతనెలా తొలగించుకున్నాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘‘భయపడే వాడికి భయపెట్టేవాడికి మధ్య ఒకడుంటాడు.. వాడే పోలీస్’..
‘‘పట్టుకుంటారని భయపడి పారిపోయే టైపు కాదురా.. పరిగెత్తించే పోలీస్ ని’’..
‘‘పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమన్యుడిని కాదురా.. పోలీస్’’..
‘కవచం’ అనే సోకాల్డ్ థ్రిల్లర్లో కొన్ని డైలాగులివి. ఈ పంచ్ డైలాగుల్ని బట్టే సినిమా ఎలా నడుస్తుందో ఒక అంచనాకు వచ్చేయొచ్చు. మామూలుగా థ్రిల్లర్ సినిమా అంటే దాని నడత మీద మనకు కొన్ని అంచనాలుంటాయి. ఈ జానర్లో సినిమా అన్నాక ఎంత పెద్ద హీరో అయినా.. తన హీరోయిజం అంతా మడిచి పక్కన పెట్టి కథలో ఒదిగిపోవాల్సి ఉంటుంది. ఏమైనా ఎలివేషన్లు ఉన్నప్పటికీ అవి కథలో భాగంగా.. సన్నివేశాల బలంతో ఉండాలి తప్ప తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉండకూడదు. ‘1 నేనొక్కడినే’లో మహేష్ అయినా.. ‘ధృవ’లో రామ్ చరణ్ అయినా.. ‘నాన్నకు ప్రేమతో’లో ఎన్టీఆర్ అయినా తమ ఇమేజ్ ను పక్కన పెట్టి ఆ కథల్లో ఒదిగిపోయే ప్రయత్నమే చేశారు. ఐతే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కథ ఎలాంటిదైనా తన ఎలివేషన్ తనకు ఉండాల్సిందే అని కండిషన్ ఏమైనా పెట్టాడో ఏమో తెలియదు కానీ.. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ థ్రిల్లర్ కథను హీరో ఎలివేషన్లతో కమర్షియల్ స్టయిల్లో చెప్పబోయి దీన్ని ఎటూ కాకుండా తయారు చేశాడు. కథేంటో చెప్పమంటే వివరించడానికి కొంచెం కష్టపడే స్థాయిలో కొన్ని మలుపులతో స్టోరీ వరకు బాగానే రాసుకున్నాడు శ్రీనివాస్ మామిళ్ల. కానీ ఈ మలుపుల్ని ఆసక్తికర రీతిలో తెరమీద ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకం. కానీ ‘కవచం’ ఆ ఆసక్తిని రేకెత్తించడంలోనే విఫలమైంది. దీనికి ప్రధాన కారణం దర్శకుడి ఔట్ డేటెడ్ నరేషనే. థ్రిల్లర్ సినిమాల్లో నేరుగా తొలి సన్నివేశంతోనే కథను మొదలుపెట్టడం.. ప్రతి సన్నివేశాన్ని కథతోనే లింక్ చేస్తూ ఆసక్తికర స్క్రీన్ ప్లేతో నడిపించడం అవసరం. కానీ మొదలు మొదలే హీరో ఎలివేషన్.. ఇంట్రడక్షన్ సాంగ్ తో ఒక సగటు సినిమాను తలపిస్తుంది ‘కవచం’. ‘‘నేను బిల్డప్ ఇవ్వను బ్రో’’ అంటూ హీరో మీద ఇంట్రో సాంగ్ తీశారు కానీ.. సినిమా మొత్తం ఆ బిల్డప్పులకే సరిపోయింది. హీరోకు ఎలివేషన్ ఇవ్వడానికి అవసరం లేని ఫైట్లు.. పాటకు టైం అయిందన్నట్లుగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వచ్చే పాటలు.. కాసేపటికే సినిమాను పక్కదారి పట్టించేస్తాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్టుతో కానీ ప్రేక్షకుడు సినిమాలో లీనం కాని పరిస్థితి.
ఐతే హీరో ఎటూ పాలుపోని అయోమయంలో చిక్కుకున్నాక కూడా విలన్ ఫోన్ చేస్తే.. పోలీసోడితో పెట్టుకుంటున్నావ్ చూస్కుందాం అంటూ సవాలు విసరడం.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో హీరోను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించడం ఏంటో అర్థం కాదు. హీరో ఒక సాధారణ ఎస్సై.. పైగా అతడిపై హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసు నమోదవుతుంది. పోలీసు వ్యవస్థంతా అతడి కోసం వెతుకుతుంటుంది. కానీ హీరో మాత్రం ఒక బైక్ వేసుకుని.. నెత్తిన ఒక టోపీ పెట్టుకుని దర్జాగా సిటీ అంతా తిరిగేస్తూ అన్ని చిక్కుముడులూ విప్పుకుంటూ వెళ్తుంటాడు. అసలెక్కడా హీరోకు కష్టం అన్నది కనిపించదు. సవాలే ఉండదు. ఏదనుకుంటే అది చేసేస్తూ సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్లిపోతుంటే ఇక ఉత్కంఠ ఎక్కడ..? ఆసక్తి ఏముంటుంది? కాకపోతే ద్వితీయార్ధంలో అనేక ట్విస్టులుండటం వల్ల.. కథలోని మర్మమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి వల్ల ప్రేక్షకులు కొంత మేర ఇన్వాల్వ్ అయ్యే అవకాశముంది. అంతే తప్ప ఒక థ్రిల్లర్ సినిమా నుంచి ఆశించే బిగి.. ఉత్కంఠ.. మాత్రం ఇందులో పూర్తిగా మిస్సయ్యాయి. రొమాంటిక్ ట్రాక్... పాటలు.. ఫైట్లు కథా గమనానికి ఎక్కడికక్కడ బ్రేకులేస్తాయి. హీరో ఒక దొంగకు బుద్ధి చెప్పి షాపు పెట్టించాడని.. తనకు పానీ పూరి తినడం నేర్పించాడని.. తల్లిని తీసుకొచ్చి పరిచయం చేశాడని ఇంప్రెస్ అయిపోయి వందలు వేల కోట్ల అధిపతి అయిన హీరోయిన్ ప్రేమించేయడాన్ని బట్టి ఇందులోని ప్రేమకథ ఎలా సాగుతుందో ఒక అంచనాకు వచ్చేయొచ్చు. ఇక సినిమాలోని హీరో ఎలివేషన్ సీన్లు.. పాటలు.. ఫైట్లు.. డైలాగుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కథేమో థ్రిల్లర్ జానర్లోనిది.. కానీ దాన్ని డీల్ చేసింది కమర్షియల్ స్టయిల్లో. దీంతో ‘కవచం’ రెంటికీ చెడేలా తయారైంది.
నటీనటులు:
బెల్లంకొండ శ్రీనివాస్ పర్వాలేదు. పోలీస్ పాత్రకు తగ్గ ఫిజిక్ తో లుక్ పరంగా ఓకే అనిపించాడు. నటన విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. మిగతా మాస్ మసాలా సినిమాల్లో ఎలా కనిపించాడో.. ఎలా నటించాడో ఇందులోనూ అలాగే చేశాడు. ఎప్పట్లాగే వాయిస్ విషయంలో శ్రీనివాస్ కు మైనస్ మార్కులే పడతాయి. హీరోయిన్లిద్దరూ అందంగా కనిపించారు. గ్లామర్ షో చేశారు. ఇద్దరివీ కథలో కీలక పాత్రలే కానీ.. నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. విలన్ నీల్ నితిన్ ముకేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హర్షవర్ధన్ రాణె ఓకే. పోసాని తనకు అలవాటైన పాత్రలో కనిపించాడు. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతికవర్గం:
సినిమాను బట్టే సాంకేతిక నిపుణుల ఔట్ పుట్ కూడా ఉంటుందనడానికి ‘కవచం’ రుజువుగా నిలుస్తుంది. ఈ మధ్య రొటీన్ బాట వీడి భిన్నమైన సంగీతంతో ఆకట్టుకుంటున్న తమన్.. మళ్లీ తన పాత స్టయిల్లోకి వెళ్లిపోయాడు. పాటలేవీ ఆకట్టుకునేలా లేవు. ఉన్నంతలో శ్రీనివాస్-కాజల్ మీద వచ్చే డ్యూయెట్ ఒక్కటి పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా ఏమంత ప్రత్యేకంగా లేదు. హీరో ఎలివేషన్ల కోసం ఉపయోగించిన థీమ్స్ మాస్ ను ఆకట్టుకోవచ్చు. ఛోటా కే నాయుడు ఛాయాగ్రహణంలో రిచ్ నెస్ కనిపిస్తుంది కానీ.. కొత్తదనం ఏమీ లేదు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. బెల్లంకొండ గత సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఖర్చు చేశారు. కానీ చాలా చోట్ల ఖర్చు వృథాగానే అనిపిస్తుంది. అందుకు ఉదాహరణ హీరో ఇంట్రడక్షన్ సాంగ్. పెద్ద పెద్ద స్టార్లే ఇలాంటివి కోరుకోనపుడు అంత బిల్డప్.. ఖర్చు ఎందుకో అర్థం కాదు. శ్రీనివాస్ మామిళ్ళ ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే వైవిధ్యాన్ని చూపించలేదు. అతడి నరేషన్ ఈ ట్రెండుకు తగ్గట్లు లేదు. కథ విషయంలో కసరత్తు చేసిన విషయం కనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా రాసుకోలేదు. సినిమాకు అదే ప్రధాన లోపం. దర్శకుడిగా శ్రీనివాస్ ఒక ముద్రంటూ వేయలేకపోయాడు.
చివరగా: కవచం.. కంగాళీ థ్రిల్లర్
రేటింగ్-2.25/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre