తెలుగులో ఈ గురువారం విడుదలవుతున్న ‘అరవింద సమేత’ చిత్రాన్ని తొలి వారంలో ఆంధ్రప్రదేశ్ అంతటా రోజుకు ఆరేసి షోలు ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. దానికే జనాలు ఔరా అనుకుంటున్నారు. ఐతే కేరళలో అదే రోజు విడుదలవుతున్న ఓ చిత్రాన్ని 24 గంటల పాటు విరామమే లేకుండా వరుసగా ప్రదర్శించబోతుండటం విశేషం. ఆ సినిమా పేరు.. కాయంకులం కొచున్ని. ‘ప్రేమమ్’ హీరో నివిన్ పౌలీ హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ సైతం ఓ కీలక పాత్ర పోషించాడు. ‘లీడర్’ భామ ప్రియా ఆనంద్ కథానాయికగా చేసింది. ప్రముఖ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నివిన్ పౌలీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కించిన చారిత్రక చిత్రమిది.
కేరళ సినీ చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రం రిలీజవుతోంది. ఆ రాష్ట్రంలో థియేటర్లు తక్కువ. ఎంత భారీ చిత్రమైనా మహా అయితే 200 థియేటర్లలో రిలీజవుతుంటుంది. కానీ ఈ చిత్రాన్ని ఏకంగా 300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మోహన్ లాల్ సినిమాకు సైతం ఇంత భారీ రిలీజ్ లేదు. తొలి రోజే వెయ్యి షోలకు పైగా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ‘కార్నివాల్ సినిమాస్’ మల్టీప్టెక్స్.. కేరళ వ్యాప్తంగా 19 లొకేషన్లలోని 52 స్క్రీన్లలో తొలి రోజు నిర్విరామంగా షోలు వేయనుంది. 24 గంటల పాటు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు అనుమతి లభించింది. తొలి రోజే ఆ సంస్థ 200కు పైగా షోలు ప్లాన్ చేసింది. ఇప్పటిదాకా ఇండియాలో ఏ సినిమాకు.. ‘బాహుబలి’కి సైతం ఇలా 24 గంటల పాటు నిర్విరామంగా షోలు పడలేదు. ఈ మూవీ మారథాన్ కోసం కేరళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 11వ తేదీ తెల్లవారుజాము నుంచి షోలు పడబోతున్నాయి.