కన్నడంకు చెందిన సంఘవి అక్కడ కంటే ఇక్కడ అంటే మన తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆహా చిత్రంతో తెలుగు వారితో ఓహో అనిపించుకున్న సంఘవి ఆ తర్వాత తెలుగులో చిన్నా పెద్దా హీరోలతో నటించి ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది. ఈమె తెలుగులో నటించిన 'శివయ్య' చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు సురేష్ వర్మతో ప్రేమలో పడింది. ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న సంఘవి మళ్లీ ఈమద్య కాలంలో బుల్లి తెర ఇంకా వెండి తెరలపై ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తాను హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో మీ తమ్ముడు(అలీని ఉద్దేశించి) నాకు చాలా లెటర్స్ రాశాడు. అందులో కొన్ని రక్తంతో కూడా రాశాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయం సంఘవి చెప్పగానే షాక్ తిన్న అలీ సరదాగా నేను ఇచ్చాను అని చెప్పి ఇవ్వలేదు కదా అన్నాడు.
ఇక స్కూల్ వయసులోనే ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాను అన్నాడు. అప్పుడు మా అమ్మకు ఆ అబ్బాయిని చూపించాను. అమ్మ ఆ అబ్బాయిని రమ్మంటూ పిలవడంతో అక్కడి నుండి పరిగెత్తాడు అంది. కన్నడ ప్రముఖ నటి ఆరతి అక్క మనవరాలు సంఘవి. ఈమె అసలు పేరు కావ్య రమేష్. మైసూర్ లోని వైధ్య కళాశాలలో ప్రొఫెసర్ గా సంఘవి తండ్రి చేసేవారు. నటనపై ఆసక్తితో చిన్నప్పటి నుండే నటించడం మొదలు పెట్టింది. చిన్న నాయనమ్మ ఆరతి ప్రోత్సాహంతో హీరోయిన్ గా మారినట్లుగా సంఘవి చెప్పింది.