గుణశేఖర్ కు సడెన్ గా అన్నీ కలిసొచ్చేస్తున్నాయి. ఎన్నో కష్టాలకు ఓర్చి ‘రుద్రమదేవి’ సినిమా తీసిన.. ఎన్నో పురుటి నొప్పుల తర్వాత ఎట్టకేలకు సినిమాను విడుదల చేయబోతున్న తరుణంలో సినిమాకు మంచి క్రేజ్ రావడమే కాదు.. ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు కూడా లభించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇంకొక్క రోజులో సినిమా విడుదలవుతుండగా గుణశేఖర్ ఈ తీపి కబురు అందుకున్నాడు.
గురువారం గుణ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తెలంగాణ చరిత్రకు గర్వకారణమైన రుద్రమదేవి కథతో తెరకెక్కిన సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాడు. తానీ సినిమా కోసం ఎంత కష్టపడింది వివరించారు. కేసీఆర్ గుణశేఖర్ విజ్నప్తిని మన్నించి వెంటనే ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. రుద్రమదేవి కథతో సినిమా తీసినందుకు గుణశేఖర్ ను అభినందించడంతో పాటు.. తానీ సినిమా చూస్తానని కూడా హామీ ఇచ్చాడు కేసీఆర్.
దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘రుద్రమదేవి’. ఐతే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఇంత బడ్జెట్టా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెట్టుబడి తిరిగొస్తుందా లేదా అనుమానాలున్నాయి. ఐతే పన్ను మినహాయింపు వల్ల గుణశేఖర్ కు చాలా మేలు జరుగుతుంది. ఆదాయంలో కోత తగ్గుతుంది. కోట్ల రూపాయలు మిగులుతాయి. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపు ఇస్తే గుణశేఖర్ మరింతగా సేవ్ అవుతాడు. మరి గుణశేఖర్.. చంద్రబాబును కలుస్తున్నాడో లేదో?