కార్తికేయ పెళ్లిలో విజేతగా నిలిచిన ఉపాసన

Update: 2018-12-31 05:09 GMT
టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు ఎస్‌ ఎస్‌ కార్తికేయ వివాహం రాజస్థాన్‌ లోని జైపూర్‌ కోటలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున సెలబ్రెటీలు ఈ వివాహ వేడుకలో పాల్గొని హంగామా చేశారు. ఈ పెళ్లి వేడుకలో రామ్‌ చరణ్‌ దంపతులు మరియు ఎన్టీఆర్‌ దంపతులు స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచారు. ఈ జంటలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీరితో పాటు ఇంకా ప్రభాస్‌ - నాగార్జున ప్రముఖ టాలీవుడ్‌ స్టార్స్‌ పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకను మరింత ఎంటర్‌ టైన్‌ చేసేందుకు కీరవాణి ఒక క్విజ్‌ కార్యక్రమంను నిర్వహించాడు.

స్టేజ్‌ పైకి ఒక్కొక్కరిని చొప్పున పిలుస్తూ కీరవాణి ప్రశ్నలు వేశాడు. అందరిలోకి ఎక్కువగా ఉపాసన సరైన సమాధానాలు చెప్పడంతో ఆమెను విజేతగా ప్రకటించాడు. ముఖ్యంగా ఆమెను కీరవాణి మీరు రోజు వెళ్లే జిమ్‌ ను ఎన్ని మెట్లు ఎక్కి వెళ్తారు అంటూ ప్రశ్నించాడు. అందుకు కొన్ని ఆప్షన్‌ లను కూడా ఇచ్చాడు. 19 - 20 - 21 - 22 అంటూ ఇచ్చిన ఆప్షన్స్‌ లో ఉపాసన 21 ను ఎంపిక చేసుకుంది. ఆమె చెప్పిన సమాధానం కరెక్ట్‌ అంటూ కీరవాణి ప్రకటించాడు.

ఇలా పలువురిని కీరవాణి చాలా సరదా ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకు ఎక్కువ శాతం మంది సమాధానం చెప్పలేక పోయారు. కాని ఉపాసన మాత్రం ఎక్కువ వాటికి సమాధానం చెప్పడంతో కీరవాణి నిర్వహించి క్విజ్‌ కార్యక్రమంలో విజేతగా ఉపాసన నిలిచింది. ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా తారలు వేసిన డాన్స్‌ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫొటోలు, -వీడియోలతో ప్రస్తుతం సోషల్‌ మీడియా ముంచెత్తుతున్నారు.



Full View

Tags:    

Similar News