ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎవర్ని చూసినా ఆర్.ఆర్.ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులోనూ ఆ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. 'ఈ కీరవాణి రాజమౌళి సినిమా అంటే చాలు గంజాయి తాగి మ్యూజిక్ కొడతాడో ఏమో..' ఇది మొన్న ఉగాది రోజు ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ రిలీజైనపుడు ఓ నెటిజన్ ట్విట్టర్లో చేసిన కామెంట్. లేటెస్టుగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన సీతారామరాజు ఇంట్రో టీజర్ చూసిన నెటిజన్లు కూడా ఇలాగే కామెంట్లు పెడుతున్నారు. కీరవాణి తరం మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఇప్పుడు అసలు లైమ్ లైట్లోనే లేరు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ పవర్ ఫుల్ మ్యూజిక్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. మిగతా సినిమాల సంగతేమో కానీ.. రాజమౌళి చిత్రం అంటే మాత్రం కీరవాణి చెలరేగిపోతాడంతే. తన శక్తి సామర్థ్యాలన్నీ జక్కన్న సినిమా కోసమే దాచుకున్నట్లుగా అత్యున్నత స్థాయి మ్యూజిక్ ఇస్తాడు.
రాజమౌళి సినిమాల్లో కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాత, కొత్త తరం వాయిద్యాల కలయికతో రోమాలు నిక్కబొడుచుకునే సౌండ్స్‌తో ఎక్కడ లేని ఎమోషన్ తీసుకొస్తాడు కీరవాణి. మొన్న మోషన్ పోస్టర్లో సౌండ్స్ విన్న వాళ్లందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇప్పుడు రామరాజు వీడియోలో కూడా ఇలాంటి మూమెంట్స్‌కు లోటు లేదు. వీడియో ఆరంభంలో వచ్చిన వెరైటీ సౌండ్‌తోనే కీరవాణి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. చూస్తున్న వారి గుండె వేగాన్ని పెంచేశాడు. మధ్యలో డప్పు సౌండ్ కొంచెం రొటీన్‌గానే అనిపించినా, ఆ తర్వాత మళ్లీ తన మార్కు సంగీతంతో కీరవాణి వావ్ అనిపించాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, అన్నిటికీ మించి విజువల్స్, రాజమౌళి టేకింగ్ కూడా ఓ రేంజిలో ఉండటంతో ఈ స్పెషల్ వీడియో పేలిపోయింది. మోషన్ పోస్టర్, టీజర్లకే ఇలా ఉంటే.. ఇక సినిమాలో కీరవాణి ఏ స్థాయిలో చెలరేగిపోయాడో మరి.