'నాటు నాటు' క్రేజ్ తో వీర‌మ‌ల్లు వ్యాపార‌మా?

Update: 2022-12-26 10:56 GMT
'ఆర్ ఆర్ ఆర్' లో  'నాటు నాటు' పాట  ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా స‌క్సెస్ లో కీరోల్ పోషించిన సాంగ్ అది. ఇప్పుడ‌దే పాట ఆస్కార్ బ‌రిలోనూ నిలిచింది. ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో బెస్ట్ సాంగ్స్ జాబితాలో  నాటు నాటు  నిలిచింది.  మొత్ం 81 పాట‌లు ఎంపిక చేయ‌గా..వాటిలో 15 పాట‌లు షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డ్డాయి. దీంతో ఈ పాట‌కు సంగీతం అందించిన ఎం.ఎం కీర‌వాణి పేరు ఇప్పుడు ఇంటా బ‌య‌టా హాట్ టాపిక్ గా మారింది.

నిజంగా ఆపాట‌కి ఆస్కార్ అవార్డు అందుకుంటే?  కీర‌వాణి అంత‌కు మించి సాధించాల్సింది ఇంకేమి ఉండ‌దు. ఇప్ప‌టికే బాహుబ‌లి తో వ‌ర‌ల్డ్ లోనే ఫేమ‌స్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ తో హాలీవుడ్ లోనూ తెలిసిపోయారు. ఇక డాల్పి థియేట‌ర్ లో జ‌రిగే వేడుక‌లో అవార్డు కూడా అందుకేసుకుంటే?  కీర‌వాణి జ‌న్మ‌ధ‌న్య‌మే. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇప్పుడిదే క్రేజ్ తో 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' మార్కెట్ లో స్వైర విహారం చేస్తోంది.

ఈ సినిమాకి కూడా కీర‌వాణి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత సంగీతం అందిస్తోన్న సినిమా కూడా ఇదే. దీంతో వీర‌మ‌ల్లు సినిమా  పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవుతుంది. యూనిట్ ఇంకా ఎలాంటి ప్ర‌చారం మొద‌లు పెట్ట‌కుండానే? వీర‌మ‌ల్లు పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది.

అందుకు కార‌ణం కీర‌వాణి. నాటు నాటు పాట ఆస్కార్ రేసులో ఉండ‌టంతో?  వీర‌మ‌ల్లు సంగీత ద‌ర్శ‌కుడు కూడా 'ఆర్ ఆర్ ఆర్' కి ప‌నిచేసిన మ‌నిషే అంట క‌దా! అంటూ చ‌ర్చ సాగుతోంది.

దీంతో మ్యూజిక్ కంపెనీలు..డిజిట‌ల్ కంపెనీలు వీర‌మ‌ల్లు రైట్స్ కోసం అప్పుడే పోటీ కూడా ప‌డుతున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొస్తుంది. ఓటీటీ కంపెనీలు ప్ర‌ధానంగా కోట్ల రూపాయాలు వ‌చ్చించి డానికి ముందుకొస్తున్నాయ‌ట‌. దీనికి కార‌ణం కేవ‌లం కీర‌వాణి బ్రాండ్ ఇమేజ్ అనే వినిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు తెలుగు రాష్ర్టాల్లో మిన‌హా ఇత‌ర చోట్ల పెద్ద‌గా మార్కెట్ ఉండ‌దు.

నార్త్ రీజియ‌న్స్ లో అస్స‌లు క‌నిపిచ‌చ‌దు. కానీ అనూహ్యంగా అక్క‌డ నుంచి మంచి బిజినెస్ ఆఫ‌ర్లు వీర‌మ‌ల్లుకి వ‌స్తున్నాయి స‌మాచారం. కానీ చిత్ర నిర్మాత‌లు మాత్రం ఏమాత్రం కంగారు ప‌డ‌లేదుట‌. బిజినెస్ గేట్లు ఇంకా తెర‌వ‌లేద‌ని చెప్పి పంపిచేస్తున్నారుట‌. మ‌రి ఈ క్రేజ్ ని నిర్మాత‌లు ఎలా ఎన్ క్యాష్ చేసుకుంటారు? అన్న‌ది చూడాలి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News