ఒక ప్రముఖ సంగీత దర్శకుడు తనకు అనేక అవార్డులు.. రివార్డులు ఇచ్చిన ఒక ఫాటను పాడమంటే..? ప్రత్యేక ఇంటర్వ్యూలలో కానీ.. పెద్ద వేదికల మీద కానీ.. ఆయనకు అంత పేరు తెచ్చిన పాటను పాడమంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? సాధారణంగా తనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాటను పాడేందుకు ఏ సంగీతదర్శకుడు వెనుకాడరు. అడిగినంతనే పాడేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి.
ఆయన స్వరపర్చిన.. ‘‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’’ అంటూ మాతృదేవోభవ చిత్రంలోని పాట ఎందరినో కదిలించింది. ఆ పాట వింటుంటే.. తెలీని విషాదం వెంటాడుతుంది. ఆ పాటకు కీరవాణికి జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. అలాంటి పాటను కీరవాణి నోటి వెంట మరోసారి వినాలని అడిగిన వారికి ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా కుదరదని చెప్పేస్తారు. ఎందుకిలా అంటే.. ఆయన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఈ పాట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమని.. ఆయన తనకు తానుగా ఈ పాటను పాడుకుంటారని.. ఒక్కడిగా ఉన్నప్పుడు ఈ పాటను హమ్ చేసుకునే అలవాటు జూనియర్ కు ఉందని చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఈ పాటను ప్రత్యేకంగా పాడి అతనికి అంకితం ఇచ్చినట్లు చెప్పాడు.
జూనియర్ కు అంకితం ఇచ్చిన సందర్భంలో కీరవాణి ఆయనకు ఒక మాట ఇచ్చారంట. ఇకపై తాను ఆ పాటను ఏ వేదిక మీదా పాడనని చెప్పారట. అందుకే.. ఆ పాటను తాను పాడలేనని చెప్పుకొచ్చారు కీరవాణి. ఒక అద్భుతమైన పాటను.. ఆ పాటను స్వరపరిచిన కీరవాణి నోటి వెంట మరోసారి వినే అదృష్టం కలగాలంటే జూనియర్ ఓకే చెప్పాలన్న మాట. ఈ పాటను ఎంతగానో అభిమానించే కోట్లాది మంది సంగీతప్రియుల కోసం.. కీరవాణిని ఒకసారి పాడమని చెప్పొచ్చుగా జూనియర్..?