సిస్ట‌ర్ పాత్ర కోసం 3కోట్లు అడిగిన మ‌హాన‌టి

Update: 2021-08-08 04:07 GMT
మ‌హాన‌టిగా అత్యుత్త‌మ న‌ట‌న‌తో ప్ర‌పంచాన్ని అబ్బుర‌ప‌రిచిన కీర్తి సురేష్ కెరీర్ ఆరంభ‌మే జాతీయ అవార్డు గ్ర‌హీత‌గా ఖ్యాతి ఘ‌డించారు. ఓవైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూనే న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న క‌థాంశాల్ని కీర్తి ఎంపిక చేసుకుంటూ కెరీర్ ని సాగిస్తోంది. కీర్తి సురేష్ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు.  ఒక్కో సినిమాకు రూ .2 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఇటీవ‌లే నితిన్ స‌ర‌స‌న రంగ్ దేలో న‌టించింది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కార్ వారి పాట‌లో కీర్తి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటికి రూ.2 కోట్ల మేర పారితోషికం అందుకుంటోంది. త‌దుప‌రి మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ కోసం కీర్తి సంతకం చేసింది. దాని కోసం భారీ పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని ఫిల్మ్ సర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చిరు సోదరిగా నటించడానికి కీర్తి రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

కానీ కీర్తి కోసం అంత పెద్ద పారితోషికం ఇస్తారా? అంటే.. వేదాళం రీమేక్ మేకర్స్ అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడానికి ఇష్టపడలేదని తగిన రీప్లేస్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే ఆ పాత్రను పోషించగల స‌మ‌ర్థ‌వంత‌మైన‌ నటి దొర‌క్క‌పోవ‌డంతో చివరికి కీర్తి వ‌ద్ద‌కే తిరిగి వ‌చ్చి త‌న డిమాండ్ మేర‌కు పారితోషికాన్ని  చెల్లించేందుకు అంగీక‌రించార‌ని తెలుస్తోంది.

ఈ చిత్రం అన్నా చెల్లెళ్ల‌ సెంటిమెంట్ నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. ఇందులో మెగాస్టార్ పాత్ర సీరియ‌స్ యాక్ష‌న్ మోడ్ లో సాగుతూనే చ‌క్క‌ని ఫ‌న్ ని ఎలివేట్ చేసే విధంగా తీర్చిదిద్దుతున్నార‌ని తెలిసింది. ఇక చిరు త‌న ఏజ్ కి త‌గ్గ పాత్ర‌ను ఎంపిక చేసుకోవ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Tags:    

Similar News