హైద‌రాబాద్ పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ లా దిగిన కీర్తి

Update: 2020-12-26 15:30 GMT
క్రిస్మస్ సందర్భంగా తార‌లంతా ఒక‌రోజు సెలవు తీసుకుని కుటుంబ స‌భ్యుల‌తో స్పెండ్ చేసి తిరిగి హైద‌రాబాద్ లో షూటింగుల‌కు రిట‌న్ అవుతున్నారు. ఇదిగో ఇక్క‌డ కీర్తి కూడా అలానే స్వ‌స్థ‌లానికి వెళ్లి వ‌స్తూ క‌నిపించింది.

కీర్తి సురేష్ హైదరాబాద్ విమానాశ్రయంలో ఎంతో ఇస్మార్ట్ లుక్ తో కనిపించింది. ఆమె పోర్ట్ లో గ్రౌండ్ సిబ్బందితో సంభాషణలు జరిపి హోస్టెస్ నే త‌ల‌పించింది. ఆల్-న్యూట్రల్ ఎయిర్ ఫోర్ట్ లుక్ తో మెరుపులు మెరిపించింది. అద్భుతమైన క్లాస్సీ లుక్ తో కనిపించింది. జిప్పర్ డిటెయిలింగ్.. కాలర్ పాకెట్స్ తో ఫుల్ హ్యాండ్స్ లో గోధుమ రంగు దుస్తులు ధరించి ట్రెంచ్ కోట్ సిల్హౌట్ లో... పోనీటైల్ ఓవల్ సన్ గ్లాసెస్ ధ‌రించి..క‌నిపించింది. ఆ ముఖానికి బ్లాక్ మాస్క్ .. డిజైన‌ర్ హ్యాండ్ బ్యాగ్ తో ఎంతో స్పెష‌ల్ గా క‌నిపించింది కీర్తి.

కెరీర్ సంగ‌తి చూస్తే.. కీర్తి త్వరలోనే రజనీకాంత్- నయనతారలతో కలిసి తమిళ చిత్రం అన్నాథే చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ ‌లో చేయనున్నారు. అయితే సెట్ సభ్యులు కరోనావైరస్ పాజిటివ్ రావ‌డంతో షూట్ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నయనతార తిరిగి చెన్నైకి వెళ్లింది. బిపి హెచ్చుతగ్గుల కారణంగా రజిని ఆసుపత్రిలో చేరారు. ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమ‌య్యేవ‌ర‌కూ వేచి చూడాలి. తెలుగులో ఆది పినిశెట్టి - జగపతి బాబులతో కలిసి `గుడ్ లక్ సఖి`లో కనిపిస్తుంది. ఇది తెలుగులో నాగేష్ కుకునూర్ తొలి చిత్రం అవుతుంది. అలాగే నితిన్- వెంకీ అట్లూరి రంగ్ దే లోనూ కీర్తి నాయిక‌గా న‌టించింది.
Tags:    

Similar News