కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కెరీర్ ని 'మహానటి' ఒక్కసారిగా మలుపు తిప్పింది. నిత్యామీనన్ ని ఈ పాత్ర కోసం ముందు అనుకున్నా తను మధ్యం సేవించే సీన్ లు చేయనని తన సన్నిహితుల వద్ద బరస్ట్ కావడంతో హార్ట్ అయిన అశ్వనీదత్ తనని తప్పించమన్నారట. అదే సమయంలో ఆ అవకాశం కీర్తి సురేష్ ని వరించింది. ఈ వార్త బయటికి రావడంతో ముందు తనకు నటనే రాదన్నారు... మహానటి పాత్రలో తను నటించడం ఏంటనే విమర్శలు కూడా వినిపించాయి.
దర్శకుడు నాగ్ అశ్విన్ తనని పెట్టుకుని సాహసం చేస్తున్నాడని, ఆ తరువాత విమర్శలు ఎదుర్కొంటాడని కామెంట్ లు వినిపించాయి. అయితే ఆ కామెంట్ లకు స్పందించని కీర్తి సురేష్ మహానటిగా సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా? అన్నంతగా అద్భుతంగా నటించిన విమర్శించిన వాళ్ల చేతే శభాష్ అనిపించుకుంది. అంతే కాకుండా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది.
దీంతో హీరోయిన్ గా కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ క్రేజ్ ని కీర్తి కరెక్ట్ గా వాడుకోలేకపోతోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. 'మహానటి' తరువాత క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ మహిళా ప్రధాన చిత్రాలే ఎంచుకోవడం గమనార్హం. చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన నటి కీర్తి సురేష్. కమర్షియల్ హీరోయిన్ గా 'నేను శైలజ' మూవీతో మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తరువాత చేసిన 'మహానటి'తో మరింత క్రేజ్ ని దక్కించుకుంది. అయితే ఆ క్రేజ్ కి తగ్గట్టుగా సినిమాలు చేయలేదని ఇప్పటికీ కీర్తిపై కామెంట్ లు పడుతూనే వుంటాయి. విక్రమ్ తో స్వామి స్క్వేర్, విశాల్ తో 'పందెం కోడి 2, సర్కార్ వంటి సినిమాల్లో నటించింది. ఇందులో 'సర్కార్' తప్ప మిగతావి పెద్దగా ఆడలేదు. ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ కథలతో రూపొందిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, సాని కాయిధమ్ వంటి సినిమాల్లో నటించింది.
నటిగా మంచి నటిగా పేరు తెచ్చుకున్నా ఆ స్థాయికి తగ్గ సినిమాల్లో కీర్తి నటించడం లేదని ఈ సినిమాలని ప్రధానంగా చూపిస్తున్నారు. ఇదిలా వుంటే కీర్తి సురేష్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. మహబూబ్ నగర్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో మెరిసింది కీర్తి సురేష్.
తన ఆశలన్నీ ఇప్పడు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాసీవ్ యాక్షన్ డ్రామా 'దసరా'పైనే వున్నాయి. న్యూ కమర్ శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 30న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కీర్తి కెరీర్ ని మళ్లీ సరికొత్త ట్రాక్ లోకి తీసుకురావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.