‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ కు ఒక మేనరిజమ్ డైలాగ్ ఉంటుంది. ఎవరు ఏది అడిగినా... ‘ఆఫ్టర్ వన్ ఇయర్...’ అంటూ మొదలెడతాడు నటకిరీటి. ఒక్క సంవత్సరం పోతే... నేను రాజునవుతానని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. సరిగా ఈ డైలాగ్ టాలీవుడ్ ముద్దుగుమ్మకు సరిపోతుంది. అయితే ఆ పిల్ల పరిస్థితి మాత్రం తారుమారైంది. అంతే తేడా. ఆమె మరెవరో కాదు కీర్తి సురేష్.
కీర్తిసురేష్... ‘నేను.. శైలజ’ సినిమాతో ఘనంగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అతి తక్కువగా మాట్లాడే సెన్సిటివ్ అమ్మాయి శైలజ పాత్రలో నటించి మెప్పించింది. వరుస ఫ్లాపులతో ఫ్యాన్ ఫాలోయింగ్ కోల్పోతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి కొత్త ఎనర్జీని నింపిందీ చిత్రం. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది కీర్తి సురేష్. మొదటి సినిమాలా కాకుండా ఇందులో చలాకీ పిల్లగా కనిపించింది కీర్తి. ఈ సినిమా ఏకంగా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంతో మహేష్- తారక్ - పవన్ కల్యాణ్ వంటి స్టార్లందరూ ఆమె డేట్ల కోసం ఎదురుచూశారు. ఆఫ్టర్ వన్ ఇయర్ కీర్తి సురేష్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా.
పవన్ కల్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’ సినిమా ఒప్పుకున్న కీర్తి సురేష్... మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమా ఛాన్సు వచ్చినా డేట్స్ సమస్య కారణంగా వదులుకుంది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలోనూ నటించింది. ‘అజ్ఞాతవాసి’ విడుదలయ్యి అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం కీర్తిసురేష్ పైన కూడా పడింది. ఆమెకు అవకాశం ఇస్తామన్న హీరోలందరూ ఇప్పుడు తర్వాతి సినిమాల కోసం పూజా హెగ్దేను హీరోయిన్ గా ఎంచుకున్నారు. పాపం... పాప పరిస్థితి ఆఫ్టర్ వన్ ఇయర్... అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి పడిపోయింది. అయితే ‘మహానటి’ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటే మాత్రం మళ్లీ కీర్తి సురేష్ కి వరుస అవకాశాలు వస్తాయనడంలో అనుమానం లేదు.