టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కీర్తి సురేశ్ దూసుకుపోతోంది. ఒక వైపున తమిళ సినిమాలతో పాటు మరో వైపున తెలుగులోను ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా ఆమె 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ముఖ్య అతిథుల్లో ఒకరిగా వచ్చింది. గోల్డ్ కలర్ డ్రెస్ లో స్టేజ్ పై ఆమె మిల మిల మెరిసిపోయింది. ఈ సినిమాను గురించి ఆమె మాట్లాడుతూ .. "ఈ వేడుకకు నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను.
కిశోర్ గారు తెలుగులో నా ఫస్టు సినిమా 'నేను శైలజ'కి డైరెక్టర్. ఆయన సినిమాతోనే ఇక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. కిశోర్ తన సినిమాకి తన పేరు వేసుకోకపోయినా అది తన సినిమా అనే విషయాన్ని మనం చెప్పేయవచ్చు. ఆయన సినిమాల్లో కథ .. డైలాగ్స్ అలా ఉంటాయి.
రష్మిక గారి విషయానికి వస్తే తను చాలా టాలెంటెడ్ .. తను చాలా పాప్యులర్. తనకి నేను కంగ్రాట్స్ చెబుతున్నాను. కెరియర్ బిగినింగ్ నుంచే 'తగ్గేదే లే' అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇకపై కూడా 'తగ్గేదే లే' అన్నట్టుగానే ఆమె కెరియర్ కొనసాగాలని కోరుకుంటున్నాను.
శర్వానంద్ గారిని నేను కలుసుకోవడం ఇక్కడే. ఆయన విషయంలో నేను కాస్త ఫీలవుతున్నాను. 'జాను' సినిమాలో లవర్ తనని వదిలేసి సింగపూర్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాలోనేమో పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రొబ్లెమ్స్ .. ఇరిటేషన్స్ .. కాంప్లికేషన్స్ .. కన్ ఫ్యూజన్స్ ఉన్నాయి.
నెక్స్ట్ టైమ్ ఆయన రిలేషన్ షిప్స్ కొంచెం స్మూత్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇరిటేషన్స్ అన్నీ కూడా శర్వాకి వదిలేసి మార్చి 4న థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఆడవాళ్లకి మాత్రమే కాదు .. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ జోహార్లు" అంటూ ముగించింది.
ఇక దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ .. "ఈ రోజు జరిగిన ఈ ఈవెంట్ ను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమాకి మీరంతా ఫ్యామిలీతో వెళ్లండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ ఈవెంట్ కి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ సింపుల్ గా ముగించాడు.