అప్పటివరకు నాకు లవ్ ప్రపోజల్స్ రాలేదు: మహానటి భామ

Update: 2020-07-24 10:10 GMT
తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది కన్నడ భామ కీర్తిసురేష్. అమ్మడు అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. అతికొద్ది కాలంలోనే తెలుగు కుర్రకారును తన బుట్టలో వేసుకుంది. ఇండస్ట్రీలో ఎలాంటి స్కిన్ షో గాని, గ్లామర్ పాత్రలు చేయకుండానే కీర్తి వరుస అవకాశాలు తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే హీరో నితిన్ సరసన రెండు సినిమాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట'.. సినిమాలతో పాటు 'మిస్ ఇండియా' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇక ఈ విషయాలు పక్కన పెడితే కీర్తి మొదటి నుండి కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన లవ్ మేటర్ గురించి అడిగితే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

"నాకు స్కూల్ నుండి కాలేజీ వరకు అసలు లవ్ ప్రపోజల్స్ రాలేదు. కానీ హీరోయిన్ అయ్యాక ఓ షాప్ ఓపెనింగుకి వెళ్ళినప్పుడు మాత్రం ఓ ప్రపోజల్ నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ షాప్ ఓపెనింగ్ టైంలో ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఓ కవర్ నా చేతికి ఇచ్చాడు. అందులో అన్నీ నా ఫోటోల కలెక్షన్స్ ఉన్నాయి. చూడడానికి ఎంతో బాగా అనిపించింది. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు. అతనితో మాట్లాడలేదు కూడా. కానీ అతను ఇచ్చిన ప్రపోజల్ కవర్లో మాత్రం.. నాపై ఉన్న అతని అపారమైన అభిమానం తెలిపాడు. అంతేగాక నేను ఓకే అంటే పెళ్లి చేసుకుంటానని కూడా ఎం రాసాడు. ఆ టైంలో నాకు ఆ ప్రపోజల్ నచ్చింది. ఇప్పటికి ఆ ప్రపోజల్ కవర్ భద్రంగా దాచుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. ఇక తన క్రష్ గురించి మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా.. కీర్తి సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో కూడా నటిస్తుంది. అంటే దాదాపు సౌత్ స్టార్ హీరోల అందరి సరసన అవకాశాలు దక్కించుకుంటుంది కీర్తి.


Tags:    

Similar News