ఈరోజుల్లో ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ చాలా అవసరం. కొన్నిసార్లు ప్రమోషన్స్ కొంత మందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ప్లాన్స్ ఎంతవరకు ఆడియెన్స్ వద్దకు చేరతాయో ఎవరికి తెలియదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి యూనిట్ మాత్రం ఏ చిన్న విషయాన్ని బయటపెట్టినా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ సక్సెస్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా అజ్ఞాతవాసి ట్యాగ్ లతో పవన్ లేటెస్ట్ ఫొటోస్ దర్శనం ఇస్తున్నాయి.
అయితే మొన్నటివరకు లీక్ అయిన ఫొటోస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంత వరకు సక్సెస్ అయ్యోయో గాని వాటికంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు ఆజ్ఞాతవాసికి సంబంధించిన మరో ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ బుగ్గలను కీర్తి సురేష్ గిల్లే సిన్ కు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫొటోలో పవన్ కొంచెం అలకతో ఉండగా ముద్దొస్తున్నావ్ అనేలా కీర్తి తన చేతులతో పవన్ చెంపలను ప్రేమతో గిల్లడం చాలా బావుంది అంటున్నారు సినీ ప్రేమికులు.
ఫొటోలోనే ఇంత బావుంటే సినిమాలో ఈ జంట ఎంత బావుంటుందో అని అందరు ఆసక్తిగా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయనుంది. త్రివిక్రమ్ పక్కా ప్రణాళికలతో పవన్ రాజకీయ షెడ్యూల్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మిగతా కార్యక్రమాలను తానే చూసుకుంటున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.