''నేను శైలజ'' అనే సినిమా సక్సెస్ కావడంతో ఒక్కసారిగా హీరోయిన్ కీర్తి సురేష్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ మధ్యన ఏ తెలుగు సినిమా గురించి న్యూస్ వచ్చినా.. అందులో హీరోయిన్ కీర్తి సురేష్ అంటూ రూమర్ వస్తూ ఉండేది. కట్ చేస్తే ఈ బంగారం కనీసం ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అసలు ఇప్పటివరకు ఆమె తదుపరి తెలుగు సినిమా అనేదే లేదు. ఆ సినిమా వచ్చి 7 నెలల కావొస్తున్నా మరి తెలుగులో ఎందుకు చేయట్లేదట ఈ పాపాయ్?
''నాక్కూడా తెలుగులో సినిమాలు చేయాలనే ఉంది. కాని కొందరు చెప్పిన కథలు బాగాలేదు. అలాగే కొన్ని సినిమాల కోసం డేట్లు సర్దుబాటు చేయలేకపోయా. తమిళంలో మాంచి కథలూ మాంచి రోల్సూ వస్తున్నాయి. పైగా అక్కడ స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి.. అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. తెలుగులోనే కాదు.. నా మాతృబాష మలయాళంలో కూడా ఇంకా సినిమా ఏదీ సైన్ చేయలేదు'' అంటూ సెలవిచ్చింది కీర్తి సురేష్. అంటే మన దగ్గర మహేష్ బాబు ప్రక్కన మురుగుదాస్ సినిమాలో ఛాన్సు.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో అవకాశం.. నాని సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.. అంటూ వచ్చిన న్యూసులన్నీ కేవలం రూమరే అనమాట.
వాస్తవంగా చెప్పాలంటే.. సెక్సీ లుక్కింగ్ మసాలా పాత్రలకు కీర్తి సురేష్ చాలా దూరం. కాని మన బడా స్టార్ల సినిమాల్లో ఆ గ్లామర్ దట్టించకపోతే కష్టమాయే. అసలు ఈమెకు స్టార్ హీరోల దగ్గర నుండి ఛాన్సులు రాకపోవడానికి అదొక కారణం అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే ఈమె స్ర్టిక్ట్ గా స్కిన్ షో చేయడానికి అవకాశాలు లేవ్ అంటూ బోర్డు పెట్టేసిందిలే.