కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ చిత్రం ''మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ''. ప్రియదర్శన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని గతేడాది మార్చిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇలా ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాని ఒక దశలో డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ ఎట్టకేలకు థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గుచూపారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తోంది.
'మరక్కార్: అరేబియా సముద్ర సింహం' చిత్రంలో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో మలయాళ బ్యూటీ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తూ కనిపించింది.
అలానే మరో ఫొటోలో మలయాళ యువరాణి గెటప్ లో అలరించింది. 15వ శతాబ్దంలో పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన కేరళ నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. మోహన్ లాల్ టీనేజ్ పాత్రలో ప్రణవ్ కనిపిస్తుండగా.. దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె, 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ అతడి ప్రేయసిగా నటించారు. అర్జున్ సర్జా - మంజు వారియర్ - సునీల్ శెట్టి - సిద్ధిఖ్ - సుహాసిని మణిరత్నం - నెడుముడి వేణు - ఫాజిల్ - రంజిఫణిక్కర్ - హరీశ్ పేరడి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
ఆశీర్వాడ్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ 'మరక్కల్' సినిమాని నిర్మించారు. రాహుల్ రాజ్ సంగీతం సమకూర్చారు. ఎస్ తిరు సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. 'మరక్కల్' మూవీ విడుదలకు ముందే మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం.
ఉత్తమ చిత్రం - స్పెషల్ ఎఫెక్ట్స్ - కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు సాధించింది. మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.