మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్'.. 'అ ఆ'.. 'శతమానం భవతి' చిత్రాలతో తెలుగులో వరస హిట్లతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. వరసగా నాలుగు ఫ్లాపులతో అనుపమ కెరీర్ ఇప్పుడు కాస్త కన్ఫ్యూజన్ లో పడింది. హిట్లూ ఫ్లాపులు లేనిదెవ్వరికి? అందరికీ ఉంటాయి కాబట్టి ఆ విషయం పక్కన బెట్టేద్దాం.
తాజాగా అనుపమ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. సహజంగా సోషల్ మీడియాలో బ్యూటీలు ఫోటోల పోస్టులు ఎలా ఉంటాయంటే మాడరన్ డ్రెస్సులు.. లేదా బికినీలు. అవి హాటుగా లేక ఛస్తాయా? కానీ అనుపమ మాత్రం ఒక అందమైన చీర కట్టుకుని సంప్రదాయ సుందరి పోజిచ్చింది. సూపర్ గా ఓ నవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు చూస్తే ఎవరికైనా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అని పాటేసుకోవాలని అనిపిస్తుంది. నవ్వు కాకుండా ఈ ఫోటోలో అసలు హైలైట్ ఏంటని మేము అడగావద్దు... మీరు చెప్పవద్దు. కొన్ని కనిపించి కనిపించనట్టు ఉంటే బాగుంటాయి. అలానే.. కొన్ని చెప్పీ చెప్పనట్టు చెప్తే అందంగా ఉంటాయి!
ఈ సూపర్ ఫోటోకు అనుపమ ఇచ్చిన క్యాప్షన్ "లెట్ హ్యాపీనెస్ బీ యువర్ ఛాయిస్." నిజమే.. అందమైన పిల్ల ఏం చెప్పినా అందంగా ఉంటుంది. ప్రాక్టికల్ గా అది ఎంతమాత్రం సాధ్యమో అని మనం వాదించడం మొదలుపెట్టకుండా 'సరే' అంటే సరిపోతుంది కదా? ఈ లోకంలో ఉన్న చాలా అన్ రిటెన్ రూల్స్ లో ఒకటి ఎంటంటే.. అందమైన పిల్లతో ఎప్పుడూ వాదించకూడదు!