మలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దిలీప్ బెయిల్ పిటిషన్ ఇటీవలే మరోసారి తిరస్కరణకు గురవగా.. అతడి మిత్రుడు.. ఈ కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు నాదిర్ షా చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. దిలీప్ మీద ఆరోపణలు వచ్చినపుడు వాటిని తీవ్రంగా ఖండిస్తూ.. బాధితురాలైన నటికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు నాదిర్. తర్వాత దిలీప్ మీద పోలీసుల దృష్టి పడ్డపుడు నాదిర్ ను కూడా వదిలిపెట్టలేదు. అతణ్ని దాదాపు 13 గంటల పాటు విచారించారు కూడా.
ఆ తర్వాతి దిలీప్ ను విచారించి.. ఆ వెంటనే అతణ్ని కస్టడీలోకి తీసుకున్నారు. దిలీప్ జైలుకు వెళ్లి రెండు నెలలు దాటుతున్నా అతడికి ఇంకా బెయిల్ రాలేదు. అతడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు పోలీసులు సేకరించినట్లుగా చెబుతున్నారు. మరోవైపు నాదిర్.. పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న భయంతో విచారణ పూర్తవగానే అనారోగ్య కారణాలు చెప్పి ఆసుపత్రిలో చేరాడు. ఇటీవలే అతను బయటికి వచ్చాడు. ఐతే అరెస్టు భయంతో అతను ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఐతే దాని మీద విచారణ జరగడానికి ముందే.. తనంతట తానుగా వచ్చి తమ వద్ద లొంగిపోవాలంటూ కేరళ పోలీసులు నాదిర్ కు సమన్లు జారీ చేయడం గమనార్హం. దీంతో పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నాదిర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి అతడు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఏమంటుందో చూడాలి.