కేశవ పోస్టర్లో చాలా కంటెంట్ ఉంది బాస్

Update: 2017-04-26 11:03 GMT
గత కొన్ని రోజులుగా అందరూ ‘బాహుబలి’ మేనియాలో మునిగిపోయి ఉన్నారు. వేరే సినిమాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో చడీచప్పుడు లేకుండా ఒక కొత్త పోస్టర్ వదిలింది ‘కేశవ’ టీం. హీరోయిన్ రీతూ వర్మను నిఖిల్ హత్తుకుంటున్నాడు ఆ పోస్టర్లో. మామూలుగా చూస్తే ఏముంది ఈ పోస్టర్లో అనిపించొచ్చు. అందుకే దీని గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద డిస్కషన్ ఏమీ జరగలేదు. ఇంతకుముందు వచ్చిన ‘కేవశ’ పోస్టర్లతో పోలిస్తే ఇది మామూలుగానే ఉందని తేల్చేశారు జనాలు. కానీ కొంచెం డీప్ గా పరిశీలిస్తే తప్ప ఈ పోస్టర్ ప్రత్యేకత అర్థం కాదు.

కొంచెం కళ్లు విచ్చుకుని.. పోస్టర్ దగ్గరగా వెళ్లి చూస్తే దీని ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా కాన్సెప్టేంటో సూచించే కోడ్ భాష కనిపిస్తుంది ఈ పోస్టర్లో. ‘కేవశ’ ఒక రివెంజ్ డ్రామా అన్న సంగతి తెలిసిందే. ఒక చిత్రమైన జబ్బు ఉన్న కుర్రాడు.. పక్కా ప్లానింగ్ తో హత్యలు చేస్తూ రివెంజ్ తీర్చుకునే కథాంశంతో తెరకెక్కింది ఈ సినిమా. ఆ కుర్రాడి ప్లానింగ్ ఎలా ఉంటుందన్నది ఈ పోస్టర్లో చూపించారు. హత్యలు చేసే క్రమంలో హీరో ఎలా ప్లాన్ గీసుకున్నాడు.. ఎప్పుడేం చేయాలి.. ఎలా మూవ్ కావాలి.. ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది.. అన్న సమాచారం అంతా రాసుకున్న ప్లాన్ పోస్టర్ బ్యాగ్రౌండ్లో కనిపిస్తోంది. ఇదంతా చూస్తే తప్ప పోస్టర్ ఇంటెన్సిటీ అర్థం కాదు. డైరెక్టర్ సుధీర్ వర్మ ఎంత శ్రద్ధగా సినిమా తీశాడో చెప్పడానికి ఈ పోస్టర్ ఓ ఉదాహరణ. ‘కేశవ’ పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మే 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ప్లాన్లో ఉన్నాడు నిర్మాత అభిషేక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News