బందరులడ్డు లాంటి పిల్లకి ప్రభాస్ అంటే ఇష్టమట!

Update: 2022-09-10 08:00 GMT
కేతిక శర్మ .. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి పరిచయమైంది. పిల్ల ముఖం చందమామనే .. ఆమె సొగసులు అందాల జలపాతమే. అచ్చమైన ఆవునెయ్యితో అప్పుడే కట్టిన సున్నుండలా .. బందరు లడ్డూల కనిపించే ఈ పిల్లను చూసి మనసు పారేసుకోని పిలగాడు లేడు. బాలీవుడ్ ఆడియన్స్ ఆశించే అందాల ఆరబోతకు కేతిక మొహమాటపడదు. కన్నడ ప్రేక్షకులు కోరుకునే కనుముక్కుతీరు ఆమె సొంతం.  తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా బొద్దుగా ఉంటుంది. ఇక టాలీవుడ్ కుర్రాళ్లు కోరుకునే చలాకీదనం ఆమెలో పుష్కలంగా కనిపిస్తుంది.  

అందువల్లనే వరుస ఫ్లాపులు ఎదురవుతున్నా అవకాశాలు మాత్రం ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి .. అదీ ఆమె గ్లామర్ మహిమ. కేతిక మొదటి నుంచి ఇంతే అనే మాట ఆమె మాటలను బట్టి అర్థమవుతుంది. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ డాక్టర్స్ ఫ్యామిలీలో పుట్టింది. అమ్మ .. నాన్న  ఇద్దరూ డాక్టర్లే. కానీ కేతిక మాత్రం  యాక్టింగ్ వైపు మనసు పారేసుకుంది. ఈ రూట్లోకి రావడానికి పేరెంట్స్ ను ఒప్పించింది. అలా చదువు పూర్తి చేసేసి ముంబైలో వాలిపోయింది. చదువుకున్న అమ్మాయి .. డబ్బున్న అమ్మాయి కనుక, ముంబైను తట్టుకుని నిలబడే ముదురే కనుక ముందుకు వెళ్లింది.

ఆ తరువాత ఏం జరిగిందనే విషయలను గురించి కేతిక మాట్లాడుతూ .. "సినిమాల్లోకి వెళ్లాలంటే ముందుగా ఇండస్ట్రీ కళ్లలో పడాలి .. అలా జరగాలంటే ముందుగా మోడలింగ్ చేయాలి .. అందుకనే అటు వైపు వెళ్లాను. అదే సమయంలో యాక్టింగ్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాను. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వెళ్లాను.

యూ ట్యూబ్ నేను వదిలిన 'థగ్ లైఫ్' వీడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.  అలా ఒక గుర్తింపు వస్తుండగానే పూరి జగన్నాథ్ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అయితే అది ప్రాంక్ కాల్ అనుకున్నాను. ఆ తరువాత నిజమేనని అర్థం కావడంతో ఆడిషన్స్ కి వెళ్లాను. అలా హీరోయిన్ గా నా కెరియర్ మొదలైంది.

తొలి సినిమా 'రొమాంటిక్'తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఆ తరువాత వచ్చిన 'లక్ష్య' వలన నటన పరమైన కొన్ని విషయాలను తెలుసుకోగలిగాను. ఇక 'రంగ రంగ వైభవంగా' సినిమాతో, ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువకావాలనే నా ముచ్చట తీరింది.

తెలుగుతో పాటు తమిళంలోను వరుస సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన కథలను వినడంలో బిజీగా ఉన్నాను. బాలీవుడ్ లో నా అభిమాన నటి ఆ ఐశ్వర్య రాయ్ .. ఇక సౌత్ కి వచ్చేసరికి నాకు సాయిపల్లవి అంటే ఇష్టం. హీరోలలో  ప్రభాస్ ను ఎక్కువగా లైక్ చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News