యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ సినిమా విడుదలకు ముందే తన 31వ సినిమాను కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ వారు ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో మూవీని నిర్మించబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబో సినిమా ఈ ఏడాది చివరి వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రభాస్ తో సలార్ సినిమా షూటింగ్ ను చేస్తున్నాడు. సలార్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి మరో మూడు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
సలార్ పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ 31 సినిమా ను పట్టాలెక్కించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. భారీ అంచనాలున్న వీరిద్దరి కాంబో మూవీ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వడానికి చాలా సమయం పట్టవచ్చు. కాని ముందుగానే వీరిద్దరు పలు సందర్బాల్లో కలిశారు. తాజాగా కూడా మరోసారి ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ కలిశాడు. అయితే ఈసారి మాత్రం ఫోటో షూట్ ను చేయించడం జరిగిందట.
మే 20వ తారీకున ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజు మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్ 31 సినిమాకు సంబంధించిన పస్ట్ లుక్ లేదా ఏదైనా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయాలని భావించారట. అందుకే ప్రశాంత్ నీల్ ఇటీవల ఎన్టీఆర్ పై ఒక ఫోటో షూట్ ను చేయడం జరిగిందని సమాచారం అందుతోంది.
కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ 31 సినిమా విషయంలో నూటికి నూరు శాతం స్వేచ్చను ఇవ్వడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. తప్పకుండా ఆయన ఎన్టీఆర్ 31 సినిమాను మరో కేజీఎఫ్ గా తీర్చి దిద్దుతాడు అనే నమ్మకంను ప్రతి ఒక్క నందమూరి అభిమాని వ్యక్తం చేస్తున్నారు.