కన్నడ సినిమా 'కేజీఎఫ్' ఫస్ట్ పార్ట్ ట్రైలర్ రిలీజ్ సమయంలో ఎంత సంచలనం సృష్టించిందో.. సినిమా రిలీజ్ తర్వాత అంతకంటే ఎక్కువగా సంచలనం సృష్టించింది. ఒక్క కన్నడ భాషలోనే కాకుండా రిలీజ్ అయిన అన్ని భాషలలోనూ భారీ వసూళ్లు సాధించి కన్నడ సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమాతో హీరో యష్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఈ సినిమా రెండవ భాగానికి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో భాగం విషయంలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ ను పెంచడంతో పాటుగా బాలీవుడ్ నటులను తీసుకోవడం.. అన్నీ ఇప్పటికే జరిగాయి. ప్రస్తుతం రెండో భాగం స్క్రీన్ -ప్లే వర్క్ జోరుగా సాగుతోంది. దీంతో పాటుగా భారీ సెట్స్ ను నిర్మించాలనే ప్లానింగ్ లో ఉన్నారట. రైటింగ్ వర్క్ పూర్తయ్యి షూటింగ్ మొదలయ్యే లోపు ఈ సెట్స్ నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ సెట్స్ వీలైనంత న్యాచురల్ గా ఉండేలా నిర్మించేందుకు 'కేజీఎఫ్' టీమ్ సభ్యులు మరోసారి కోలార్ గనులకు వెళ్లి పరిశీలిస్తారట. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ నుండి మొదలు పెడతారని సమాచారం.
కోలార్ బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజయ్ కిరంగదూర్ నిర్మించారు.