''కేజీయఫ్: చాప్టర్ 2'' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఈ క్రమంలో లేటెస్టుగా ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్ లో చేరింది.
బ్లాక్ బస్టర్ 'కేజీయఫ్' ప్రాంఛైజీలో తెరకెకెక్కిన ''కేజీయఫ్ 2'' చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే అన్ని భాషల్లో వసూళ్ల వేట మొదలు పెట్టిన ఈ సినిమా.. 15 రోజుల్లోనే ఈ మైలురాయిని సాధిందింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1062 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కన్నడ చిత్ర పరిశ్రమలో వెయ్యి కోట్లు దాటిన ఫస్ట్ మూవీగా 'కేజీఎఫ్ 2' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక 2022 లో గ్లోబల్ మార్కెట్ లో 1000 కోట్లు క్రాస్ చేసిన రెండో సినిమా 'కేజీఎఫ్ 2'. దీని కంటే ముందు మార్చి 25న రిలీజైన RRR సినిమా వెయ్యి కోట్ల మార్క్ అందుకుంది.
మొత్తం మీద భారతీయ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్ లో చేసిన నాలుగో సినిమాగా 'కేజీఎఫ్ 2' నిలిచింది. ఈ జాబితాలో 'దంగల్' - 'బాహుబలి 2' - RRR సినిమాలు ఈ మాన్‌స్టెరస్ బ్లాక్ బస్టర్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. మరి లైఫ్ టైం రన్ లో ఈ కలెక్షన్స్ ఎక్కడిదాకా వెళ్లి ఆగుతాయో చూడాలి.
నార్త్ మార్కెట్ లో మూడో వారంలోనూ 'కేజీఎఫ్ 2' ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో 353.06 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో 'సంజు' 'పీకే' 'టైగర్ జిందా హై' సినిమాలను బీట్ చేసి.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. 'బాహుబలి 2' (510 కోట్లు) - దంగల్ (387 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
కాగా, కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో 'కేజీయఫ్: చాప్టర్ 2' సినిమా తెరకెక్కింది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్ - రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు ఇతర పాత్రల్లో కనిపించారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవి బస్రుర్ సంగీతం సమకూర్చారు. తమిళ్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్.. తెలుగులో వారాహి చలన చిత్ర.. హిందీలో ఫర్హాన్ అక్తర్ కు చెందిన ఎక్స్ ఎల్ మీడియా సంస్థ ''కేజీఎఫ్ 2'' చిత్రాన్ని విడుదల చేశాయి.