బాలీవుడ్ లో మరో మైలురాయి చేరుకున్న 'కేజీయఫ్-2'

Update: 2022-05-07 04:30 GMT
కన్నడ హీరో యశ్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''KGF: చాప్టర్ 2'' చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా నిలబడింది. గురువారానికి 397.95 కోట్లు సాధించిన ఈ సినిమా.. శుక్రవారంతో 400 కోట్ల మ్యాజికల్ మైల్ స్టోన్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో 'దంగల్' (387 కోట్లు) ను అధిగమించి.. 'బాహుబలి 2' (510 కోట్లు) తర్వాతి స్థానంలో నిలిచింది.

'కేజీఎఫ్ 2' సినిమా హిందీ వెర్షన్ నార్త్ మార్కెట్ లో  8 రోజుల ఫస్ట్ వీక్ లో ₹ 268.63 కోట్లు.. రెండో వారంలో ₹ 80.18 కోట్లు.. మూడో వారంలో ₹ 50 కోట్లకు పై వసూళ్లతో మొత్తం రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇకపోతే భారతీయ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో సినిమాగా 'కేజీఎఫ్ 2' నిలిచింది. ‘దంగల్’ - ‘బాహుబలి 2’ - RRR సినిమాలు ఈ మాన్స్టెరస్ బ్లాక్ బస్టర్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. శాండీల్ వుడ్ లో వెయ్యి కోట్లు దాటిన ఫస్ట్ మూవీ 'కేజీఎఫ్ 2'. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్ళను రాబడుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బ్లాక్ బస్టర్ 'కేజీయఫ్' చిత్రానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' తెరకెక్కింది. ఇందులో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్ - రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించగా.. ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

'కేజీఎఫ్ 2' సినిమాని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవి బస్రుర్ సంగీతం సమకూర్చారు. తమిళ్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్.. తెలుగులో వారాహి చలన చిత్ర.. హిందీలో ఫర్హాన్ అక్తర్ ఎక్స్ ఎల్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేశాయి.
Tags:    

Similar News