కేజీఎఫ్ 2 ఉత్తరాదిన వేవ్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే ఒక విధ్వంశం. ఉత్తరాది సిటీ వడోదరలో KGF2 స్క్రీనింగ్ సమయంలో సినిమా స్క్రీన్ ను ధ్వంసం చేసినందుకు నలుగురిపై పోలీస్ కేసులు బుక్ అయ్యాయి. వాడి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్.ఐఆర్ లో నలుగురు నిందితులు సినిమా హాల్ లో తమకు కేటాయించిన సీట్లను వేరొకరు ఆక్రమించారని తమ అసలు సీట్లకు మారమని కోరినప్పుడు ఇద్దరు టిక్కెట్ చెకర్లపై దాడి చేశారని తెలుస్తోంది.
కేజీఎఫ్ 2 విడుదల సినిమా థియేటర్ క్యాషియర్ నిమేష్ కడ్కియా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకార.., నలుగురు వ్యక్తులు సీట్లను ఆక్రమించారని ఆ సీట్ల వాళ్లు సిబ్బందికి చెప్పగా..గొడవైందని తెలిసింది. కదర్ ఖురేషీ - రాకేష్ బరియా సహా నలుగురు నిందితులను వారి సీట్లలోకి వెళ్లమని కోరారు. కానీ గడబిడ అయ్యింది. అనంతరం అరెస్టులు సాగాయి.
శుక్రవారం అర్థరాత్రి షోలో కొత్తగా విడుదలైన KGF 2 చిత్రం చూస్తున్నప్పుడు అల్పనా టాకీస్ లో 17 అడుగుల సినిమా స్క్రీన్ ను ధ్వంసం చేసి టిక్కెట్ చెకర్ పై దాడి చేసినందుకు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై వడోదర నగరంలోని వాడి పోలీస్ స్టేషన్ శనివారం కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ లో ఇలా రాసారు.
"నలుగురు నిందితులు ఇద్దరు టిక్కెట్ చెక్కర్ లపై దాడి చేయడం ప్రారంభించారు. ఆపై థియేటర్ 17 అడుగుల 3డి స్క్రీన్ ను ధ్వంసం చేశారు. దీని ధర రూ. 3.5లక్షలు. షోటైమ్ లో సినిమా ప్రదర్శనలో అవరోధం కూడా ఏర్పడింది. నిందితులు బయటకు వెళ్లే తలుపును కూడా పాడు చేశారు. హాలులో దీని ధర రూ. 50000.
వాడి పోలీస్ స్టేషన్ నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ ల కింద పరిహార నష్టం (427) కేసు.. స్వచ్ఛందంగా గాయపరచడం (323) అనే కేసు.. అసభ్యకరమైన పదాలు [294 (ఎ)ఔ కేసు.. అసభ్యకరమైన పదజాలం (114) కింద కేసు నమోదు చేశారు.