ఓవైపు కోవిడ్ 19 విలయం కొనసాగుతుంటే జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో రోడ్లపై తిరగాల్సిన పరిస్థితి ఉంటేనే వేలాది కేసులు చుట్టుముడుతున్నాయి. ఇక స్టార్ హీరోలు ఎవరూ బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఎవరికి వారు ఇండ్లలోనే ఉన్నారు. అలాగే ఇటు స్టేట్స్ అటు కేంద్రం నుంచి షూటింగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ లాక్ 4.0 నియమనిబంధనల్ని అమలు చేస్తూ పని చేయొచ్చని ప్రకటించేశాయి.
దీంతో తొలిగా సెట్స్ లోకి వెళ్లే పెద్ద హీరో ఎవరు? అన్న ప్రశ్న తలెత్తింది. ప్రభాస్.. చిరంజీవి.. మహేష్.. బన్ని వీళ్లలో ఎవరు ముందుగా సెట్స్ కి వెళ్లబోతున్నారు? అన్న చర్చ సాగింది. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ ఇంకా పెండింగ్ ఉంది. తదుపరి మరో రెండు భారీ చిత్రాల్లో నటించనున్నాడు. అందువల్ల వేగంగానే ఒకదాని తర్వాత ఒకటిగా పూర్తి చేయాల్సి ఉంది. చిరు .. మహేష్.. బన్ని .. ఇక బరిలో దిగాల్సి ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ పరిస్థితి వేరు. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తి చేస్తే కానీ తదుపరి ప్రాజెక్టుకు మూవ్ కాలేని స్థితి. అయినా వీళ్లంతా ఇంకా వేచి చూసే ధోరణినే అనుసరిస్తున్నారు. సెట్స్ కి వెళితే పలువురికి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చేస్తుండడంతో ఇంకా భయాందోళనతోనే ఉన్నారు అంతా.
సరిగ్గా ఇలాంటి స్థితిలో కేజీయఫ్ టీమ్ బరిలో దిగిపోయింది. కరోనాలో డేర్ చేసిన మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ చిత్రంగా కేజీయఫ్ రికార్డ్ సృష్టించింది. నేటి నుంచి కేజీయఫ్ సెట్ లో ప్రకాశ్ రాజ్ సహా కీలక పాత్రధారులపై చిత్రీకరణ సాగుతోంది. అందుకు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి.. కొరటాల లాంటి దర్శకులు కోవిడ్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ ధైర్యం చేసి మొదలెట్టేశారు. రాజమౌళికి ఇటీవలే మైల్డ్ గా కరోనా సింప్టమ్స్ బయటపడడంతో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.