కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌ గూస్ బంప్స్.. నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు

Update: 2022-03-27 13:31 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ విజువల్స్ ను చూస్తుంటే కళ్లు పెద్దవి అవ్వడం ఖాయం. ఇలాంటి విజువల్స్ ను ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూసిందే లేదు అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా విజువల్స్ గురించి.. యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌ వచ్చి మరో సారి చర్చనీయాంశం అయ్యింది.

కేజీఎఫ్ సినిమా ఏ స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాలను కలిగి ఉందో మనం అందరం చూశాం. కేజీఎఫ్‌ అనేది కేజీఎఫ్‌ 2 ముందు ట్రైలర్‌ మాత్రమే అంటూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఒకానొక సమయంలో చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలు కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెంచాయి. ఆ వ్యాఖ్యలు నిజమే అన్నట్లుగా తాజాగా విడుదల అయిన ట్రైలర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.   ట్రైలర్‌ లోని ప్రతి షాట్‌ కూడా గూస్‌ బంప్స్ తెప్పిస్తున్నాయి.

యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రతి ఒక్క షాట్ కూడా ఒక హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాను చూస్తున్న ఫీల్‌ ను కలిగిస్తున్నాయి. కన్నడ సినిమా అని కాకుండా ఇది ఒక ఇండియన్ మూవీ అన్నట్లుగా ప్రతి భాష ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు న భూతో అన్నట్లుగా ఉంటాయని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. మూడు నిమిషాలకు తక్కువే ఉన్న ట్రైలర్‌ లోనే ప్రశాంత్‌ నీల్‌ సినిమా చూపించేశాడు.

యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయి.. కేజీఎఫ్ కోసం రాఖీ భాయ్‌ దేశ ప్రభుత్వాన్నే ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ట్రైలర్‌ ను చూపిస్తుంటే అర్థం అవుతుంది. కేజీఎఫ్ 2 సినిమా యాక్షన్‌ సన్నివేశాలను చూస్తుంటే అబ్బుర పర్చే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. యశ్‌.. సంజయ్ దత్‌.. రావు రమేష్.. శ్రీనిధి శెట్టి.. రవీన ఇంకా ప్రముఖులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

రక్తంతో రాసిన కేజీఎఫ్ ను కంటిన్యూ చేయాలంటే మళ్లీ మరింత రక్తం కావాల్సిందే అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌ ఈ సినిమా లో మరింత వయలెన్స్ ఉండబోతుందని చెప్పకనే చెప్పింది. ఆ డైలాగ్‌ తో మొదలు అయిన ట్రైలర్ స్లో గా పీక్స్ కు చేరింది. యశ్‌ ఎంట్రీ కాస్త ఆలస్యం అయినా కూడా ఆయన కనిపించిన వెంటనే వావ్‌ అనిపించేంత మాస్ గా సన్నివేశం ఉంది.

నాకెవ్వడి దోస్తీ అక్కర్లేదు... నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు అంటూ హీరో చెప్పిన డైలాగ్‌ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. డబ్బింగ్‌ సినిమా అయినా కూడా డైలాగ్స్ ఓ రేంజ్ లో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా జోరు చూస్తుంటే మన తెలుగు బిగ్గెస్ట్‌ సినిమాల వసూళ్ల రికార్డును బ్రేక్ చేస్తుందేమో అనిపిస్తుంది.


Full View
Tags:    

Similar News