Pushpa 2: KGF గాలి గట్టిగానే తగిలింది!

Update: 2023-04-05 18:11 GMT
పుష్ప సినిమా మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక మందన హీరోయిన్‌ గా అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి ఎనలేని ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాతో బన్నీ లెవెల్ వేరే రెంజ్‌కు వెళ్లింది. ఐకాన్ స్టార్‌ గా మారిపోయాడు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు. తమిళ, కన్నడ, హిందీ, మలయాళం ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

అయితే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన కొద్ది రోజులకు విడుదలైన కేజీఎఫ్ సినిమా పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకునేలా చేసింది. ఎందుకంటే కేజీఆఫ్ మొదటి భాగాన్ని మించి రెండో భాగం కలెక్షన్స్ విషయంలో పెర్ఫార్మ్ చేసింది. సబ్జెక్టు ఊహించదగిందయినా మొదటి భాగం ఎలివేషన్ లో రెండో భాగానికి బాగా కలిసి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే సుకుమార్ పుష్ప రెండో భాగం మీద కూడా చాలా శ్రద్ధ పెట్టారు. అనేక సందర్భాల్లో సినిమా షూటింగ్ మొదలు పెట్టి... కథలో మార్పులు చేస్తూ వాయిదా వేస్తూ వచ్చారు. అలాంటి తరుణంలో ఈ సినిమా నుంచి ఒక 20 సెకండ్ల వీడియో తాజాగా విడుదలైంది. ఏప్రిల్ 7వ తేదీన కాన్సెప్ట్ టీజర్ విడుదల చేయబోతున్నారని ప్రచారం ఉంది. అయితే తాజాగా విడుదలైన 20 సెకండ్ల వీడియోతో సుకుమార్ ఇది కేజీఎఫ్ లాంటి సబ్జెక్టు కాదు... కేజీఎఫ్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో చూస్తే కేజీఎఫ్ 2 సెటప్ కి పుష్ప 2 సెటప్ కి ఏ మాత్రం సంబంధం లేదనే విషయం తేటతెల్లమయిపోయింది. అయితే పుష్ప మొదటి భాగానికి రెండో భాగానికి కలెక్షన్స్ విషయంలో చూపించిన వ్యత్యాసం పుష్ప రెండో భాగం మీద మరింత శ్రద్ధ పెట్టేలా చేశానడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే సుకుమార్ లెక్కలు సుకుమార్‌ కు ఉండే ఉంటాయి. అందుకే మొదటి భాగానికి నిర్మాతలుగా వ్యవహరించిన వారిని తప్పించి... మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ సినిమాని నిర్మిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News