'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తరువాత దేశం మొత్తం ఆసక్తిగా మరో పాన్ ఇండియా మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అదే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. కన్నడ స్టార్ యష నటించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? రాఖీభాయ్ సామ్రాజ్యాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా? అని కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. కాళీమాత ఎదురుగా గరుడ తలనరకడంతో ఫస్ట్ పార్ట్ కి ఎండ్ కార్డ్ వేసేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ తరువాత ఏం జరగబోతోంది? .. గరుడ సైన్యం ముందు యష్ ధైర్యం చెప్పిన జనం నిలబడ్డారా? అతని ప్రైవేట్ సైన్యంగా మారిపోయారా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
2018లో విడుదలైన ఫస్ట్ పార్ట్ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ పండితులని ఆశ్చర్యపరిచింది. దక్షిణాదిలోనే కాకుండా హిందీ బెల్ట్ లోనూ ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో ఇప్పడు అందరి దృష్టి 'కేజీఎఫ్ చాప్టర్ 2' పై పడింది.
గత ఏడాది హీరో యష్ పుట్టిన రోజు కు ఒక రోజు ముందు లీకైన టీజర్ సినిమాపై అంచనాల్ని స్కై హైకి చేర్చింది. గరుడ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న రాఖీ సొంత సైన్యంతో పాటు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుని మోన్ స్టర్ లా ప్రత్యర్థులపై విరుచుపడిన విధానాన్ని టీజర్ లో చూపించి సినిమా ఏ రేంజ్ లో వుండబోతోందో హింట్ ఇచ్చేశారు మేకర్స్.
అయితే గత కొన్ని రోజులుగా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా మేకర్స్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ప్రమోషన్స్ ని ప్రారంభించడం లేదంటూ యష్ అభిమానుల మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. వీరి మొరని ఎట్టకేలకు ఆలకించిన మేకర్స్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' ప్రమోషన్స్ ని ప్రారంభించడం మొదలు పెట్టారు. ఇందులో ముందుగా 'తూఫాన్ తేఫాన్..' అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
అన్నట్టుగానే సోమవారం ఉదయం 'తూఫాన్ తేఫాన్..' అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఓ వ్యక్తి రాఖీభాయ్ గురించి చెబుతున్న మాటలతో 'తూఫాన్ తేఫాన్..' లిరికల్ వీడియో మొదలైంది. 'జల్లోడపడితే ఒక్కడు కూడా నిలబడడు.. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు.. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్ అనే డైలాగ్ లతో లిరికల్ వీడియో మొదలై ఆసక్తికరమైన పదాలతో సాగుతూ ఆకట్టుకుంటోంది. రాఖీభాయ్ నారాచీని తన చేతుల్లోకి తీసుకుని సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఈ పాటని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
రవి బాసుర్రూర్ సంగీతం అందించిన ఈ పాట రోమాంచితంగా వుంది. రామజోగయ్య శాస్త్రి రచన చేసిన ఈ పాటని సాయికృష్ణ, పృథ్వీ చంద్రతో పాటు దాదాను పది మంది గాయకులు ఆలపించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించనున్న ఈ మూవీని ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయమబోతున్నారు. మార్చి 27న ఈమూవీ ట్రైలర్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Full View