నటుడు తన స్టామినా నిరూపించుకోవడానికి కాస్త సమయం పడుతుందేమో కానీ.. డైరెక్టర్ తన సత్తా చాటడానికి ఒక్క సినిమా చాలు. ఆ ఫలితం అతన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు ‘ప్రశాంత్ నీల్’ కండిషన్ ఇదే. ‘కేజీఎఫ్’ ఘన విజయంతో డైరెక్టర్ నీల్ ఘనత ఇప్పుడు ఎవరెస్టుతో పోటీ పడుతోంది. 2018లో విడుదలైన ఈ సినిమా మాసివ్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో.. ఇప్పుడు అందరి దృష్టీ.. ‘కేజీఎఫ్ 2’పైనే ఉంది. అయితే.. ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సలార్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభం కాకుండానే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.
సాలిడ్ లైనప్ తో రూపొందనున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్.. ఈ జనవరిలోనే మొదలు కానుందని సమాచారం. ఇక, ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి ‘కేజీయఫ్’ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ను తీసుకోనున్నారనే టాక్ ఇదివరకే వినిపించింది. ఇప్పుడు మరో టెక్నీషియన్‌ను తీసుకున్నాడని, అతను కూడా కేజీఎఫ్ సినిమాకు పనిచేసే వారే అని తెలుస్తోంది.
‘కేజీఎఫ్’ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి అదరహో అనిపించాడు రవి బస్రుర్. ఈ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ నే ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి కూడా తీసుకుంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమోకానీ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ సినిమాకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ రవి బస్రుర్ ను తీసుకున్నా కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
కాగా.. సలార్ కోసం కథ - స్క్రీన్ ప్లే రాసుకుంటూనే ‘భగీరా’ టైటిల్ తో మరో కథను సిద్ధం చేసుకున్నాడట ప్రశాంత్. తన బావమరిది శ్రీమురళి హీరోగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. ఇప్పటికే ‘భగీర’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. ‘సమాజం ఎప్పుడైతే దారి తప్పుతుందో.. దాన్ని కాపాడటానికి, అదుపులో పెట్టడానికి ఒకడొస్తాడు’ అంటూ పవర్ఫుల్ పోలీస్ స్టోరీ తెరకెక్కిస్తున్నాడట. మరి, ప్రభాస్ ‘సలార్’ ముందు మొదలు పెడతారా? ‘భగీర’ చిత్రాన్ని ప్రారంభిస్తారా? అన్నది చూడాలి.