ఒక స్టార్ సినిమా వచ్చిందంటే ఆ సమయంలో చిన్న చిత్రాలు పోటీపడటానికి వెనకాడతాయి. పోటీలో నలబడేందుకు ఆసక్తిని చూపించవు. కానీ ఓ డబ్బింగ్ సినిమా కారణంగా టాలీవుడ్ లో ఇప్పడు చిన్న చిత్రాలు రిలీజ్ డేట్ లు మార్చుకోవడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2`. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం డే వన్ నుంచి విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డులు సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది.
తొలి రోజు ప్రారంభ వసూళ్ల పరంగా రికార్డు సాధించిన ఈ చిత్రం దంగల్, 2.O, బాహుబలి వంటి చిత్రాల ఐదు రోజుల కలెక్షన్స్ ని అధిగమించి సరికొత్త రికార్డు దశగా పయనిస్తోంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 450 కోట్లకు పై చిలుకే సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నా యి. ఇదిలా వుంటే ఉభయ తెలుగు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీని తాకిడి కారణంగా రెండు మీడియం రేంజ్ చిత్రాలు రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం `అశోక వనంలో అర్జున కల్యాణం`, నాగశౌర్య హీరోగా నటించిన `కృష్ణ వ్రింద విహారి`. ఈ రెండు చిత్రాలని ఏప్రిల్ 22న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇందు కోసం రిలీజ్ ప్లాన్ లు కూడా చేసుకున్నారు. ప్రమోషన్స్ మొదలు పెట్టారు. సడన్ గా `కేజీఎఫ్ 2` విడుదలై బ్లాక్ బస్టర్ గా మారడం.. ఇప్పటికీ థియేటర్లలో రికార్డు స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో రాఖీభాయ్ కి ఎదురెళ్లడం ఇష్టం లేని ఈ హీరోలు తమ చిత్రాల రిలీజ్ లని వాయిదా వేసుకోవడం గమనార్హం.
అంతే కాకుండా ఈ నెలాఖరులో అంటే ఏప్రిల్ 29న మెగాస్టార్ `ఆచార్య` రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ రిలీజ్ శ్రేయాస్కరం కాదని భావించిన యంగ్ హీరోస్ తమ చిత్రాలని వాయిదా వేసుకున్నారట. గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విశ్వక్ సేన్, నాగశౌర్య చాలా ప్రత్యేకతలతో రూపొందిన `అశోక వనంలో అర్జున కల్యాణం`, `కృష్ణ వ్రింద విహారి` చిత్రాలలో నటించారు. `అశోక వనంలో అర్జున కల్యాణం` చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించారు. `కృష్ణ వ్రింద విహారి` చిత్రాన్ని అనీష్ కృష్ణ రూపొందించాడు.
ఈ రెండు చిత్రాలు హీరోలకే కాదు దర్శకులకు కూడా అత్యంత కీలకం. అందుకే రాఖీభాయ్ లాంటి మోన్ స్టార్ తో పోటిపడటం ఎందుకని తమ సినిమాలని మే నెలకు పోస్ట్ పోన్ చేసుకున్నారట. విశ్వక్ సేన్ నటించిన `అశోక వనంలో అర్జున కల్యాణం` మే 6న విడుదల కానుండగా నాగశౌర్య నటించిన `కృష్ణ వ్రింద విహారి` రిలీజ్ డేట్ ప్రకటించాల్సి వుంది. ఈ మూవీని నాగశౌర్య మదర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. దీంతో ఈ మూవీ నాగశౌర్యకు అత్యంత కీలకంగా మారింది.