గాయపడిన సింహం ఏమయిపోయిందో తెలియదు.అవసరం అనుకున్నంత సెంటిమెంట్ అంతా మొదటి భాగంతోనే సరి!కొనసాగింపులో సాగతీత తప్ప దృక్పథం లేదు..విషయం కన్నా ఎలివేషన్లే ఎక్కువ కనుక చాప్టర్ 2 నవ్వించి ఏడిపించాడు.హా హా!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరే రాజులు అని అంటున్నారు.కానీ రాజు కాదు బంటు కాదు కిరీటమే శాశ్వతం అంటున్నాడు ప్రశాంత్ నీల్.. ఈ మాటలు కొన్ని బాగున్నాయి. కథ పరంగా సినిమాలో ఆసక్తి లేదు.ఎలివేషన్లు కారణంగా సినిమాకు అతి ప్రయాస ఉంది. అతి విధ్వంసం కూడా ఉంది. అంటే కొన్ని లాజిక్కులు వదిలి చూస్తే.. సినిమాకు మరింత అర్థవంతం అయిన కథనం జోడిస్తే మేలు. ఆసక్తికర కథనం జోడిస్తే ఇంకా మేలు. కానీ ఆ ఆసక్తి కర విషయం ఈ సినిమాలో లేదు. కొన్ని పాత్రలు వాటి నడవడి మొదటి భాగానికి కొనసాగింపుగా ఉండడం బాగుంది. కానీ వాటికీ మరింత వివరం జోడించాల్సింది. అవి లేవు ఇవి ఉన్నాయి అని తిట్టుకోవడం కన్నా ఈ కన్నడ సినిమా మొదటి భాగంతోనే పూర్తయిపోతే బాగుండు అని మాత్రమే అనిపించింది.
మొహమాటానికి కూడా చాప్టర్ 2 ను ప్రోత్సహించలేం.. !
బంగారం తవ్వండి.. అప్పటిదాకా ఉన్న విశ్వాసాలనూ తవ్వండి.. ఈ కథ రక్తంతో ముందుకు వెళ్లింది సిరాతో కాదు అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. కానీ సిరాతో పోయినా రక్తంతో పోయినా కథలో వైవిధ్యం లేదు. గరుడ తరువాత అధిర ఇంతకుమించి ఆ ఇంకు రాసింది ఏమీ లేదు. కానీ.. ఈ సినిమా కాస్త నిజాయితీతో చేసిన ప్రయత్నంలా మాత్రం కూడా లేదు. ఫస్ట్ చాప్టర్ ను రీ రైట్ చేసి కాస్త క్లైమాక్స్ మార్చిన విధానమే ఈ సినిమా! అన్ని చీకటి యుద్ధాలు ఉన్నా కూడా దర్యాప్తు బృందాలకు చిక్కకపోవడం ఒక్కటే ఈ కథలో ఆశ్చర్యం అనిపించిన విషయం.
బంగారు గనుల కథను మరోసారి తెరపైకి తేవడంలో ఏమయినా రహస్యం ఉందా? గనిలో రహస్యం కాదు లేదా రాస్తున్న కథలో ఏమయినా రహస్యం దాగి ఉందా? ఉంటే ఉండాలి లేదంటే ఇంత పెద్ద సినిమాకు మరో పెద్ద సినిమా కొనసాగింపు ఎందుకు అవుతుంది? ఆ విధంగా పెద్ద సినిమా నాలుగు డబ్బులు పోగేసుకుని మరో ఎత్తుకు ఎదిగింది.
అది చూశాక ఆ ఎత్తును చేరుకునే ప్రయత్నానికి మరోసారి యష్ తన తరఫు సాయం ఇచ్చారు. ప్రశాంత్ నీల్ కాస్త అప్పుడు రాసుకున్న కథనే మళ్లీ మార్చి తీశాడు. ఆ కథ అక్కడితో సరి ఈ కథ కూడా ఇక్కడితో సరి ! మరి చాప్టర్ మూడు గోల లేదు. కానీ రెండో చాప్టర్ లో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమీ లేదు. ఇదే విమర్శను అంగీకరించడం లో అర్థం ఉంది. అంగీకరించకపోతే ఎవ్వరం ఏం చేయలేం.
పబ్లిసిటీ జిమ్మిక్కులు లేకుండా సినిమా వచ్చిందని సంతోషించాలి.ఆ విధంగా ట్రిపుల్ ఆర్ టీం చేసిన జిమ్మిక్కులు ఇక్కడ లేవని చాలా సంతోషించాలి. ప్రశాంత్ నీల్ గత కథకు మరో రూపం రాశారు. కానీ ఎందుకనో డెప్త్ లేదు అని ఓ నెటిజన్ నెత్తీ నోరూ మోదుకుంటూ వ్యాఖ్యానించాడు. ఆయనే కాదు చాలా మంది. ట్రిపుల్ ఆర్ కూడా కథ లేదు కదా అని పాపం అటు రాజమౌళి అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తూ .. తమకు తాము సర్ది చెప్పుకోవడం మినహా ఈ రెండు సినిమాల్లో భావోద్వేగాలను కథా గమన రీత్యా వాడుకున్న ఇంకాస్త బెటర్ అయితే బాగుండు.