స్టార్లు డైరెక్ట‌ర్ల‌ను KGF 2 కలెక్షన్లు బెంబేలెత్తించాయి!

Update: 2022-05-13 04:30 GMT
రాకింగ్ స్టార్ యష్ న‌టించిన KGF 2 సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌సూళ్ల ప‌రంగా బాహుబ‌లి2 తర్వాతి స్థానంలో నిల‌వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక క‌న్న‌డ సినిమా 1000 కోట్ల క్ల‌బ్ లో నిల‌వ‌డం అన్న‌ది ఒక చ‌రిత్ర‌. బాహుబ‌లి 2 ని అనుస‌రింఇ కేజీఎఫ్ 2 ఈ ఫీట్ ని సాధించింది. అయితే ఈ కలెక్షన్లు మిగతా స్టార్స్ .. స్టార్ డైరెక్టర్లందరినీ హరించాయి (భ‌య‌పెట్టాయి) అని రామ్ గోపాల్ వర్మ వ‌ర్ణించారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం అనేక పెద్ద బాలీవుడ్ చిత్రాలు విడుదలైనప్పటికీ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. యష్ నటించిన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఏకగ్రీవంగా ఆమోదించారు. థియేటర్లలో సంబరాలు చేసుకున్నారు. ``యశ్ KGF 2 కలెక్షన్లు మిగతా స్టార్స్ .. స్టార్ డైరెక్టర్లందరినీ హరించాయి`` అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ సినిమా పరిశ్రమ గురించి తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు. ``KGF 2 అనేక పెద్ద చిత్రాలను తినేసింది. KGF2 అనేది పాత ఫ్యాషన్ లన్నింటినీ మింగేసే ఆక‌స్మిక‌ తుఫాన్ ఇసుక లాంటిది`` అంటూ క‌వితాత్మ‌కంగా ఆర్జీవీ తన ట్వీట్ లో రాశాడు. ``కేజీఎఫ్ 2 ఒక పెద్ద చీకటి మేఘం లాంటిది.. మిగిలిన అన్ని పెద్ద చిత్రాలపై డూమ్స్ డే నీడను వేస్తుంది. నల్లటి మేఘాలు కుండపోత కలెక్షన్లు ఇతర స్టార్స్.. స్టార్ డైరెక్టర్లందరినీ హరించివేసాయి`` అని గురువారం మరో ట్వీట్ లో రాశారు.

`కేజీఎఫ్ 2`తో పోటీప‌డుతూ ప‌లు పెద్ద సినిమాలు ఐపు లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ముందు ఇత‌రులు ఎవ‌రూ నిల‌బ‌డ‌లేర‌ని ప్రూవ్ అయ్యింది. కేజీఎఫ్ 2తో పాటు ఆరోవారంలోనూ ఆర్.ఆర్.ఆర్ చ‌క్క‌ని వ‌సూళ్లను సాధించ‌గ‌లిగింది కానీ హిందీ సినిమాలు ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి.

ఆర్జీవీ ఆ మాట ఇందుకే అన్నారు!

2022లో హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేసిన పాన్ ఇండియా చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డుల‌కెక్కింది. ఈ చిత్రం 7వ వారంలో ర‌న్ అవుతోంది. RRR హిందీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద  6వ వారంలో  రూ. 5.52 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికి మొత్తం కలెక్షన్లు రూ. 270.66 కోట్లు. ఓవ‌రాల్ గా హిందీలో 300 కోట్ల క్ల‌బ్ లో చేరుతోంద‌ని స‌మాచారం. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం కొద్దిరోజుల‌ క్రితం విడుదలైంది. ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా బోలెడంత హైప్ తో వ‌చ్చి 1000 కోట్ల క్ల‌బ్ లో చేరి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రంలో అలియా భట్-అజయ్ దేవగన్ కూడా నటించారు. హిందీలో భారీ ఓపెనింగ్ ల‌తో మొద‌లై క‌లెక్ష‌న్ల‌లో మంచి వృద్ధిని సాధించింది.అత్యంత‌ వేగంగా రూ. 100 కోట్ల మార్క్ ని అందుకున్న చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డుల‌కెక్కింది.

ఇప్పుడు నడుస్తున్న ఏడ‌వ వారంలో RRR మరో రూ. 5.52 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు ఇప్పుడు రూ. 290.66 కోట్ల నుంచి 300కోట్ల వైపు వెళుతోంద‌ని స‌మాచారం. 2022లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ర్యాంక్ పొందింది.

ఇక ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత విడుద‌లైన కేజీఎఫ్ 2 కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌సూళ్ల రేంజును ప‌రిశీలిస్తే...RRR 6వ వారంలో 6 కోట్లు రేంజులో వ‌సూలు చేస్తుండ‌గా.. కేజీఎఫ్ 2 మూడోవారంలో 8 కోట్లు రేంజులో వ‌సూలు చేసింది. ఒక రోజుకు ఈ రేంజు క‌లెక్ష‌న్లు టైగ‌ర్ ష్రాఫ్ హీరో పంతికి కూడా రాలేదు. దేవ‌గ‌న్ ర‌న్ వే 34 కి కూడా ఇంత సీన్ క‌నిపించ‌డం లేదు. ఏడో వారంలో కూడా ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 (నాలుగో వారం) ఇంకా ఆడుతున్నాయంటే అర్థం చేసుకోవాలి. హాలీవుడ్ నుంచి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ లో మెగా హాలీవుడ్ ఎంటర్ టైనర్ డాక్టర్ స్ట్రేంజ్ విడుదలతో కొంత‌వ‌ర‌కూ వ‌సూళ్లు మంద‌గించినా ఇప్ప‌టికీ భార‌తీయ సినిమాల్లో ఇవే బెస్ట్ అని నిరూపిస్తున్నాయి.
Tags:    

Similar News