ప్రస్తుతం దేశం మొత్తం కూడా కేజీఎఫ్ గురించిన చర్చ జరుగుతోంది. మొదటి పార్ట్ వచ్చిన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కేజీఎఫ్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ప్రశాంత్ నీల్ మరో సారి కన్నడ సినిమా స్థాయిని ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేశాడు. ఒకప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు అంటే పది కోట్ల సినిమాలు. కాని ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారింది.
ప్రశాంత్ నీల్ పై నమ్మకంతో యశ్ పై ఉన్న విశ్వాసంతో హంబుల్ నిర్మాణ సంస్థ వారు కేజీఎఫ్ నిర్మాణంకు ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్న సమయంలో ఇది ఒక కన్నడ సినిమా అనే విషయాన్ని వారు మర్చి పోయారు. కన్నడ సినిమా స్థాయిని వారు మర్చి పోయి అద్బుతమైన సినిమా అన్నట్లుగా నమ్మకంతో బడ్జెట్ పెట్టారు. మొదటి పార్ట్ కు వారు పెట్టిన పెట్టుబడికి డబుల్ కి డబుల్ వసూళ్లు నమోదు అయ్యాయి.
ఇక కేజీఎఫ్ 2 తో అదే స్థాయి లో నిర్మించారు. ఈసారి హంబుల్ వారు ఖర్చు విషయంలో మరింతగా దూకుడుగా వ్యవహరించారు. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాణ సంస్థ హంబుల్ వారు ఇప్పుడు సుధ కొంగర తో సినిమాను చేసేందుకు సిద్దం అయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. సుధ కొంగర సినిమా అదుగో ఇదుగో అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
సూరారై పోట్రు సినిమా తర్వాత సుధ కొంగర ఇమేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగింది. ఆమె తో వర్క్ చేయాలని చాలా మంది హీరోలు ఆసక్తిగా ఉన్నారు. సూర్య తోనే మళ్లీ ఈమె సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ సినిమా ప్రకటన ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అందరికి షాక్ ఇచ్చేలా హంబుల్ బ్యానర్ లో సుధ కొంగర మూవీ అంటూ ప్రకటన వచ్చింది.
సుధ కొంగర మరియు హంబుల్ వారి కలయిక భలే కుదిరిందే అంటూ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు విషయంలో వెనకాడని హంబుల్ వారు మేకింగ్ విషయంలో వెనక్కు తగ్గని సుధ కొంగర కాంబోలో సినిమా అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అంతే కాకుండా ఏ భాషలో తెరకెక్కినా అన్ని సౌత్ భాష వారు హిందీ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించడం ఖాయం అంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన విషయాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. హీరో మరియు ఇతన నటీ నటులు ఇంకా సాంకేతిక నిపుణులకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం హంబుల్ నిర్మాణ సంస్థ వారు ప్రభాస్ తో సలార్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ 2 సక్సెస్ తో భారీ ప్రాజెక్ట్ లు చేసేందుకు హంబుల్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.