కన్నడ సెన్షేషనల్ మూవీ కేజీఎఫ్ కు కొనసాగింపు అన్నట్లుగా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దం అయ్యి నెలలు గడుస్తోంది. గత ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. గత ఏడాది నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని వారాల క్రితం ప్రకటించారు. కాని ఆ తేదీకి కూడా సినిమా విడుదల అనుమానమే అన్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ జరిగింది. బాలీవుడ్ మీడియాలో కేజీఎఫ్ 2 విడుదల తేదీ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. పలు సినిమాలు ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్దం అవుతున్న కారణంగా కేజీఎఫ్ 2 కు కొత్త విడుదల తేదీని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 యూనిట్ సభ్యులు పుకార్లకు చెక్ పెడుతూ మరోసారి విడుదల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేలా ప్రకటించారు.
కేజీఎఫ్ 2 విడుదల తేదీ విషయంలో జాతీయ మీడియాలో ప్రసారం అవుతున్న కథనాలను కొట్టి పారేశారు. తమ సినిమా ముందుగా ప్రకటించినట్లుగానే వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఖచ్చితంగా విడుదల చేయబోతున్నాం అంటూ ప్రకటించారు. కేజీఎఫ్ కు పది రెట్ల హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండే కేజీఎఫ్ 2 ను సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఆధరిస్తారని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు కేజీఎఫ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ 2 సినిమా ను ఈ ఏడాదిలోనే ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని భావించారు. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కనీసం థియేటర్లు ఓపెన్ అయిన పరిస్థితి లేదు. కనుక కేజీఎఫ్ 2 సినిమా విడుదల తేదీ కాస్త ఆలస్యంగానే ఉంటే బెటర్ అనే నిర్ణయానికి వచ్చి వచ్చే ఏడాది సమ్మర్ కు ఫిక్స్ చేశారు.
ఇంకా దాదాపుగా ఆరు నెలలకు పైగా సమయం ఉంది. కనుక అప్పటి వరకు పరిస్థితులు అన్ని కూడా కుదుట పడుతాయని.. సినిమాలు మళ్లీ మునుపటి విధంగా ప్రాచుర్యం సంతరించుకుని థియేటర్ల వద్ద ప్రేక్షకుల క్యూలు కనిపించబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు. అలాంటి సాదారణ పరిస్థితుల్లో కేజీఎఫ్ 2ను విడుదల చేస్తేనే సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విడుదల తేదీ విషయంలో మరింత గందరగోళం ఉండకుండా కేజీఎఫ్ 2 ను అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లుగా ప్రశాంత్ నీల్ ప్రకటించడంతో అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం అయినా కూడా కేజీఎఫ్ తో యశ్ మరో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు. కేజీఎఫ్ తో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిన యశ్ ముందు ముందు బాలీవుడ్ స్టార్స్ తో సమానమైన క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.