మెగాస్టార్ 150వ చిత్రంగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150.. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిపోతోంది. తెలుగురాష్ట్రాల్లోనూ మెగాస్టార్ మూవీ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇండియాలో బెనిఫిట్ షోస్ పడే కంటే ముందే.. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ను ప్రదర్శించి.. భారీ మొత్తంలో కలెక్షన్స్ గడించడం టాలీవుడ్ లో ఆనవాయితీ.
అయితే.. ఇందుకు తగ్గట్లుగా పక్కా ప్లాన్ ప్రకారం జరగాలంటే.. రెండ్రోజులు ముందుగానే అక్కడి ప్రాంతాలకు హార్డ్ డిస్క్ లు చేరాల్సి ఉంటుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకే ఖైదీ నంబర్ 150కి సంబంధించిన హార్డ్ డిస్క్ లు అమెరికా చేరిపోయాయి. దీంతో బుధవారం రిలీజ్ కు గానీ.. మంగళవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ కు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండబోవనే విషయం తేలిపోయింది. మరోవైపు మెగాస్టార్ కంబ్యాక్ మూవీ హార్డ్ డిస్క్ లను చేతుల్లో పట్టుకుని.. ఓవర్సీస్ లో మెగా ఫ్యాన్స్ తమ ఆనందాన్ని ప్రదర్శించారు.
ఇక ఈ హార్డ్ డిస్క్ లను అప్ లోడ్ చేసుకోవడం ఒకటే బ్యాలెన్స్. ఓవర్సీస్ లో ఖైదీ నంబర్ 150ని భారీ మొత్తానికే కొనుగోలు చేయడంతో.. కనీసం 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధిస్తేనే ఇక్కడ బ్రేక్ఈవెన్ సాధ్యమవుతుంది. అయితే.. మెగాస్టార్ ఈ మార్క్ ను ఈజీగానే అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/