శ్రీమంతుడిని దాటేస్తున్న ఖైదీ..!

Update: 2017-01-21 12:45 GMT
ద‌శాబ్దం విరామం త‌రువాత వ‌చ్చినా మెగాస్టార్ త‌న స‌త్తా చాటుకుంటున్నారు. ఖైదీ నంబ‌ర్ 150తో మెగా రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన తొలి ప‌దిరోజుల్లోనే బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుకుంటోందీ చిత్రం. క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను న‌మోదు చేసుకుంటూ వ‌స్తోంది. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన ద్వితీయ చిత్రంగా నిలిచిన ‘శ్రీ‌మంతుడు’కి ఖైదీ చేరువైపోయాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ్రీ‌మంతుడు రూ. 85.2 కోట్ల షేర్ (145 కోట్ గ్రాస్)  రాబ‌ట్టాడు. అయితే, ప‌దిరోజుల్లోనే ఆ క‌లెక్ష‌న్ల‌కు చేరువైంది ఖైదీ నంబ‌ర్ 150. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 80 కోట్ల పైనే షేర్ దాటేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఖైదీ రాబ‌ట్టి వ‌సూళ్లు రూ. 84 కోట్లు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఖైదీ చేసిన వ‌సూళ్లు రూ. 62.77 కోట్లు. ఉత్త‌రాంధ్రాలో అయితే బాహుబ‌లి వ‌సూళ్ల‌ను కేవ‌లం 10 రోజుల్లోనే ఖైదీ క్రాస్ చేయ‌డం విశేషం. ప్రాంతాల వారీగా వ‌సూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.


నైజాం - రూ. 15. 12 కోట్లు

సీడెడ్ - రూ. 12.00 కోట్లు

నెల్లూరు - రూ. 2.76 కోట్లు

గుంటూరు - రూ. 6.04 కోట్లు

కృష్ణా - రూ. 4.62 కోట్లు

వెస్ట్ - రూ. 5.28 కోట్లు

ఈస్ట్ - రూ. 6.94 కోట్లు

ఉత్త‌రాంధ్ర - రూ. 10.01 కోట్లు

ఉత్త‌రాంధ్ర‌లో బాహుబ‌లి వ‌సూళ్లు చేసిన క‌లెక్ష‌న్ల రికార్డును కేవ‌లం 10 రోజుల్లోనే ఖైదీ తిర‌గ‌రాసింది. ఈ ప్రాంతంలో బాహుబ‌లి రూ. 9.7 కోట్లు రాబ‌ట్టింది. 10 రోజుల్లోనే రూ. 10.01 కోట్ల‌ను మెగాస్టార్ సొంతం చేసుకోవ‌డం విశేషం.

ప‌దిరోజుల్లో ఏపీ, తెలంగాణ మొత్తం వ‌సూళ్లు - రూ. 62. 77 కోట్లు

అమెరికాలో ఇప్ప‌టికే 2 మిలియ‌న్ డాల‌ర్ల మార్కుని దాటేసింది. మొత్తంగా 2.275 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు సాధించింది. గ‌డ‌చిన వారంతో పోల్చుకుంటే కాస్త క‌లెక్ష‌న్లు త‌గ్గినా కూడా... ఇంకా సినిమాకు మాంచి వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News