తార‌క్‌ పైకి ఛుమ్మా విసిరేసిందే

Update: 2019-12-26 09:51 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న‌కి ..డ్యాన్స్ ల‌కు ఫిదా కానిది ఎవ‌రు? తార‌క్ ని స్టార్ గా నిలెట్టిన‌వి ఆ రెండే. నంద‌మూరి వార‌సుడిగా టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగ‌ర్ తాత ( ఎన్టీరామారావు) కి త‌గ్గ మ‌న‌వ‌డిగా నిరూపించుకున్నాడు. పాత్ర ఎదైనా... స‌న్నివేశం ఎదైనా తార‌క్ ప్ర‌తిభ‌కు లొంగాల్సిందే. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల‌డు. ఇక యంగ్ టైగ‌ర్ డాన్సుల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. శ‌రీరాన్ని విల్లులా వంచి స్ప్రింగులా న‌ర్తించ‌గ‌ల‌ స‌మ‌ర్ధుడు. ఆ ర‌కంగా నంద‌మూరి ఫ్యామిలీకే ఓకొత్త ఐడెంటిటీని తీసుకొచ్చిన గొప్ప డాన్స‌ర్. తాజాగా తార‌క్ పై సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బు ముద్దుల వ‌ర్షం కురిపించి హాట్ టాపిక్ గా మారింది.

అలీతో జాలీగా షోలో ఖుష్బు స‌ర్వం మ‌రిచి తార‌క్  పై అభిమానాన్ని చాటుకున్న విధానం హాట్ టాపిక్ గా మారింది. తార‌క్ ని త‌ల‌వంగానే విజిల్స్ వేస్తూ నానా హంగామా చేసారు. షో లో తార‌క్ ఫోటో చూడ‌గానే ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. ఖుష్బూ గ‌తంలో తార‌క్ తో క‌లిసి `య‌మ‌దొంగ` సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో మోహ‌న్ బాబు భార్య‌గా న‌టించారు. ఆ సినిమాలో తార‌క్ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఆ సినిమాతో తార‌క్ ఎంతో మందికి అభిమాన హీరో అయ్యాడు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న కూడా.. బెస్ట్ న‌టుడు ఎవ‌రు.. అని ప్ర‌శ్నిస్తే మ‌రో మాట మాట్లడ‌కుండా తార‌క్ అని చెబుతారు.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తుంటే...తార‌క్ కొర‌మం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం విశాఖ మ‌న్యంలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. బ్యాలెన్స్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూలైలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంతో చ‌ర‌ణ్-తార‌క్ ఇమేజ్ రెట్టింపు అవుతుంద‌న్నఅంచ‌నాలు ఉన్నాయి.




Tags:    

Similar News