తెరపై కనిపించే పాత్రలు కామన్ ఆడియెన్ కి కనెక్టవ్వాలంటే నేటివిటీ టచ్ చాలా ముఖ్యం. అది మిస్సయితే కంటెంట్ ఎంత గొప్పగా ఉన్నా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఉండదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న `ఆర్చీస్` ఇదే కేటగిరీకి చెందుతుందా? అంటే అవుననే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ తో ఏకంగా నలుగురు నటవారసులు బాలీవుడ్ తెరకు పరిచయం అవుతుండడంతో అన్ని కళ్లు దీనిపైనే నిలిచిన సంగతి తెలిసిందే.
అగ్ర సినీకుటుంబాల నుంచి ఖుషీ కపూర్- సుహానా సహా మరో ఇద్దరు తారలు ఈ సిరీస్ తో తెరకు పరిచయం అవుతున్నారు. ఇదివరకూ రిలీజైన ఫస్ట్ లుక్ అంతర్జాలంలో వైరల్ అయ్యింది. అయితే అప్పట్లోనే దీనిపై రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్చీస్ లో నటీమణుల వేషధారణలు పూర్తిగా పాశ్చాత్య ధోరణితో ఉన్నాయని ఇందులో భారతీయత అనేది అస్సలు కనిపించడం లేదని కూడా విమర్శలొచ్చాయి.
తాజాగా ది ఆర్చీస్ కోస్టార్స్ తో ఖుషీ కపూర్ - సుహానా ఖాన్ చిల్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆర్చీస్ గ్యాంగ్ ప్రస్తుతం ఊటీలో ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన షూటింగ్ ను హిల్ స్టేషన్ లో జరుపుతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్.. షారూక్ నటవారసురాలు సుహానా ఖాన్ పైనే అందరి దృష్టి. తాజాగా ఈ ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఊటీలోని వారి ఆన్-షూట్ లొకేషన్ నుండి ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అయితే చాలా మంది నెటిజనులు భారతీయత గురించి ప్రశ్నిస్తున్నారు.
సుహానా- ఖుషీ ది ఆర్చీస్ నుండి వారి కోస్టార్ లతో కొన్ని సోలో ఫోటోలను పంచుకున్నారు. ది ఆర్చీస్ లో బెట్టీ కూపర్ గా ఖుషీ నటిస్తోంది. ఖుషీ సిరీస్ లో బ్యాంగ్స్ తో గేమ్ ఆడనుంది. తాజా ఫోటోలలో ఖుషీ చాలా అందంగా కనిపిస్తున్నా కానీ భారతీయత మిస్సయ్యిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఖుషీ మోడ్రన్ ఔట్ ఫిట్ లో అందంగా కనిపిస్తోంది. అందమైన చిరునవ్వు ఆకట్టుకుంటోంది. కానీ ఈ లుక్ కి మిశ్రమ స్పందనలు వచ్చాయి. బెట్టీ కూపర్ పాత్రలో ఆమె ఎలా నటిస్తుందో వేచి చూడాలి.
ఆర్చీస్ గ్యాంగ్‌లో సుహానా ఖాన్ -ఖుషీ కపూర్ -వేదాంగ్ రైనా అకా రెగ్గీ -యువరాజ్ మెండా అకా డిల్టన్ ఇలా పోజులిచ్చారు. సుహానా ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో తన ముఠాతో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె కొన్ని సోలో ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ సిరీస్ లో సుహానా వెరోనిక్ గా నటిస్తోంది. రుద్ర మహువకర్ - యువరాజ్ మెండాతో కలిసి కొన్ని ఫోటోలకు సుహానా పోజులిచ్చింది. టీమ్ అంతా టీనేజ్ వైబ్స్ ని వెదజల్లారని చెప్పాలి. ఇంతకీ ఈ గుంపులో ఎవరు జోక్ చేసారో కానీ ఆర్చీస్ గ్యాంగ్ హార్ట్ ఫుల్ గా నవ్వుతూ కనిపించింది. నెట్ ఫ్లిక్స్ లో ఆర్చీస్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో పాత్రలకు ఆడియెన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అన్నది వేచి చూడాలి.