ముంబై బ్యూటీ కియారా అద్వానీ మాల్దీవుల హాలిడేలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒంటరి దీవుల్లో బులుగు సముద్రం చెంత అడుగుపెడుతూనే ఒక అదిరిపోయే స్నీక్ పీక్ ని పరిచయం చేసింది ఈ భామ. మాల్దీవుల్లో స్నేహితుడు (ప్రియుడు అంటున్నారు) సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వీరవిహారం చేస్తోందన్న గుసగుసల నడుమ వేడెక్కించే సోలో బికినీ ఫోటోతో కియరా ఇంతకుముందు విరుచుకుపడింది.
తన వెకేషన్ ఆల్బమ్ కు తాజాగా కియరా మరో అద్భుత చిత్రాన్ని జోడించింది. అయితే ఈ ఫోటో చూడగానే ఒంటరి దీవుల్లో అలా దారి తిప్పి వెళ్లిపోతే ఎలా? అంటూ అభిమానులు రకరకాల సందేహాల్ని వెలిబుచ్చారు. ఏదో బీచ్ సమీపంలోని మర్రిచెట్టు చెంత జోష్ తో కనిపిస్తున్నా.. కియరా డేర్ తో కాన్ఫిడెన్స్ తో చాలా అందంగా కనిపిస్తోంది.
తన ఇన్ స్టాలో కియారా అద్వానీ ఒక పోస్ట్ లో ``ఒంటరిగా`` ఉన్నానని కవ్వించడమే కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. ఒంటరిగా సోలోగా ఉన్నానని పదే పదే కియరా గుచ్చి గుచ్చి చెప్పాల్సి రావడానికి కారణం ఎవరు అంటే తనేనన్న సంగతిని ఎప్పటికి గుర్తెరుగుతుందో? ఇంతకుముందు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసే వచ్చింది కదా? ఇప్పుడిలా ఒంటరిగా అంటూ కవర్ చేసేస్తోందేమిటి? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
తన తాజా పోస్ట్ లో బీచ్ లో రెడ్ హాట్ దుస్తులు ధరించి కనిపించింది. ఆ బూడిద రంగు షాడో శిరోజాలతో కాస్ట్యూమ్స్ ని జత చేసింది. తన ఫోటోకి క్యాప్షన్ జోడించకపోయినా ఒంటరిగా అన్న అర్థం వచ్చేలా సింబల్ జోడించింది.
ఈ ఫోటోతో పాటు కియారా బీచ్ లో సైకిల్ నడుపుతున్న వేరొక ఫోటోని షేర్ చేసింది. ఈ క్యాప్షన్ తో అద్భుత వీడియోను పంచుకుంది. ``మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ స్వంత ఫోటో మీరే తీయాలి`` అంటూ తెలిపింది. కియారా అద్వానీ మాల్దీవులకు చేరుకున్న వెంటనే 2021 నిన్ను చూస్తోంది! అంటూ వేడెక్కించే ఫోటోని షేర్ చేసింది. కియారా అద్వానీ- సిధార్థ్ మల్హోత్రా బుధవారం నాడు ముంబై విమానాశ్రయం నుంచి మాల్దీవులకు పయనమవుతూ కెమెరా కంటికి చిక్కారు. కానీ కియరా షేర్ చేసిన ఫోటోల్లో సిద్ధార్థ్ మాత్రం మిస్సవ్వడం సందేహాలకు తావిస్తోంది.