భరత్ లవర్ నేను.. హామీ ఇస్తున్నాను!

Update: 2019-06-25 05:13 GMT
బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హాట్ బ్యూటీస్ లో కియారా అద్వాని ఒకరు.  ఇప్పటికే 'M.S.ధోని' లాంటి చిత్రాల ద్వారా బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ తో ఈ అమ్మడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  తాజాగా కియారా నటించిన 'కబీర్ సింగ్' బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతోంది.  దీంతో ఒక్కసారిగా  కియారా క్రేజ్ డబల్ అయింది.

ఈ భామ టాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో నటించిన 'భరత్ అనే నేను' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి తెలుగు ప్రేక్షకుల్లో కియారాకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది.  తెలుగులో రెండవ చిత్రం 'వినయ విధేయ రామ' నిరాశ పరిచినా కియారాకు ఆఫర్లు ఇచ్చేందుకు మన ఫిలిం మేకర్లు ఇంకా రెడీగానే ఉన్నారు. మరి కియారా ఇప్పుడు 'కబీర్ సింగ్' తో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కదా.. ఇక సౌత్ సినిమాల్లో నటిస్తుందా? ఇదే విషయం రీసెంట్ గా కియారాను అడిగితే ఏడాది కి ఒక సౌత్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నానని వెల్లడించింది.

సహజంగా చాలామంది హీరోయిన్లు మొదట సౌత్ సినిమాలలో నటిస్తారు కానీ బాలీవుడ్ లో బిజీ కాగానే సౌత్ సినిమాలను పట్టించుకోకపోవడం.. విమర్శలు ఎక్కుపెట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ వారికి భిన్నంగా కియారా మాత్రం ఏడాదికి ఒక సౌత్ సినిమా చేస్తానని హామీ ఇవ్వడం ఇక్కడి ప్రేక్షకులను సంతోషపెట్టే విషయమే. కియారా ఇప్పటివరకూ సౌత్ లో టాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే నటించింది.  తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి' రీమేక్ తోనే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించింది కదా.. మన ఫిలిం మేకర్ల ప్రతిభ గురించి తెలుసు.. అలాంటప్పుడు మంచి ఆఫర్లు వస్తే ఎలా వదులుకుంటుంది? ఇదిలా ఉంటే కియారా ప్రస్తుతం 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కి జవాని' సినిమాల్లో నటిస్తోంది.


    

Tags:    

Similar News