కియారా.. క్యా స్టైల్ యార్..!

Update: 2021-01-26 16:30 GMT
సినిమాలపై పాషన్ చూపించాలి.. సినిమాల్లో ఫ్యాషన్ చూపించాలి.. అప్పుడే హీరోయిన్ గా క్లిక్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక, బాలీవుడ్లోనైతే కంపల్సరీ. అక్కడ ఉండే హెవీ ట్రాఫిక్ ను తట్టుకొని రేస్ లో నిలబడాలంటే.. ఫ్యాషన్ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇస్తూనే ఉండాలి. ఈ విషయాన్ని ఉగ్గుపాలతోనే పసిగట్టినట్టుగా నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.

టాలీవుడ్లో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ముంబై భామ కియారా. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితం అయినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. అద్దిరిపోయే ఫొటోలతో అప్డేట్స్ ఇస్తూ రిలేషన్ మెయింటెయిన్ చేస్తూనే ఉంది.

కాగా.. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. సరికొత్త ఫ్యాషన్ డిజైన్ ను ఒంటికి తగిలించుకున్న ఈ బ్యూటీ.. తన ఎద అందాలను ఆమూలాగ్రం ఆరబోస్తోంది. ఫ్యాన్స్ అందుకోవడమే ఆలస్యం అన్నట్టుగా ఉన్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇలాంటి హాట్ స్టిల్స్ తో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ నెట్వర్కింగ్ లో ఫాలోవ్స్ లిస్ట్ అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.
Tags:    

Similar News